Minister vishwaroop deadline on congress party

minister vishwaroop deadline on congress party

minister vishwaroop deadline on congress party

విభనపై నిర్ణయం వెనక్కి తీసుకోవాలి : మంత్రి విశ్వరూప్

Posted: 09/02/2013 09:13 PM IST
Minister vishwaroop deadline on congress party

రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయాన్ని నవంబర్ ఒకటవ తేదీ లోపల కేంద్రం వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో నవంబర్ రెండవ తేదీన తన మంత్రిపదవికి రాజీనామా చేస్తానని విశ్వరూప్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో కలిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు సీఎంను కలిసానని, రాష్ట్ర విభజన జరగదని, రాజీనామా విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని సూచించారని తెలిపారు. నవంబర్ ఒకటి లోగా కేంద్రం విభజనపై చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోకపోతే 2న తాను స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పిస్తానని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. ప్రస్తుతం తాను విధులకు దూరంగా ఉన్నానని తెలిపారు. రాష్ట్ర విభజనే జరిగితే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన కొద్దిరోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని, రాష్ట్ర విభజన జరిపితే తానే మొదటిగా రాజీనామా చేస్తానని ప్రకటించారు. విభజన జరగకుండా శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఉధృతంగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆయన పలుమార్లు ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles