Veda chanting for samaikyandhra

Veda chanting for samaikyandhra, Vijayawda Durga Temple, Kala Sarpa Dosham for State, Kanaka Durga blessings Samaikyandhra

Veda chanting for samaikyandhra

రాష్ట్రానికి కాలసర్పదోషం

Posted: 08/30/2013 11:41 AM IST
Veda chanting for samaikyandhra

రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగి, జనజీవనం స్థంబించి, వ్యాపారాలు కుంటుపడి, రాజకీయ నాయకులకు ఎదురుదెబ్బలు తగులుతూ, ఢిల్లీలో పెద్దలు సీమాంధ్రుల వేదనలను పెడచెవిని పెట్టటం ఇదంతా కాలసర్పదోషంతో పట్టుకున్న పీడ అని విజయవాడ కనకదుర్గ దేవస్థానంలోని వైదిక కమిటీ సభ్యుడు శంకర శాండిల్య చెప్తూ, దోష పరిహారం కోసమే వేద పఠనం చేసామని, ఇంకా లక్ష కుంకుమార్చనలు, చండీ యాగాలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర సమైక్యతకు పాటుపడతామని అన్నారు. 

అరండల్ సత్రం దగ్గర వేద విద్యార్థులు చేసిన వేద పఠనం అనంతరం శాండిల్య పై విధంగా మాట్లాడుతూ, తప్పక రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని తన నమ్మకాన్ని ప్రకటించారు.
సమాక్యాంధ్రకు మద్దతుగా దేవస్థానం ఆల్ కేడర్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం వేద పఠనం జరిగింది.  రాష్ట్రం సమైక్యంగా ఉంటూ శాంతిసౌఖ్యాలతో విలసిల్లాలని ప్రార్థనలు జరిపారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles