Jadcherla tdp mla surrender to sp

Jadcherla tdp mla surrender to sp, Jadcherla tdp mla surrender to police , Jadcherla TDP MLA Erra Shekhar, Jagan Mohan surrendered, Devarakadra, murder case

Jadcherla tdp mla surrender to sp, Jadcherla tdp mla surrender to police

హత్య కేసులో లొంగిపోయిన టిడిపి ఎమ్మెల్యే

Posted: 08/26/2013 03:09 PM IST
Jadcherla tdp mla surrender to sp

సోదరుడి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ జడ్చర్ల ఎమ్మెల్యే (.చంద్రశేఖర్) ఎర్ర శేఖర్ జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఆయన గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. సోదరుడి హత్య కేసులో ఎర్రశేఖర్ ప్రధాన నిందితుడు. ఎమ్మెల్యే సోదరుడు జగన్మోహన్ దేవరకద్ర పాత బస్టాండ్ సమీపంలో జూలై17న హత్యకు గురైన సంగతి తెలిసిందే. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తన భర్తను ఆయన సోదరుడు, ఎమ్మెల్యే ఎర్ర శేఖరే హత్య చేయించారని జగన్మోహన్ భార్య ఆశ్రిత అప్పట్లో ఆరోపించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో స్వగ్రామంలో తమ భార్యలను సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో నిలిపారు. ఎన్నికలలో ఎమ్మెల్యే శేఖర్ భార్య విజయం సాధించారు. కాగా, జగన్మోహన్ హత్య కేసులో ఎర్ర శేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయన ఈ రోజు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. హత్య అనంతరం శేఖర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వెతికాయి. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం శేఖర్ పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో అతను ఈ రోజు లొంగిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles