11 mps in suspension proposal

11 MPs in suspension proposal, Seemandhra MPs for suspension, Kamalanath for MPs suspension, Bharatiya Janata Party, Telangana Statehood, Samaikyandhra movement

11 MPs in suspension proposal

11 మంది పార్లమెంటు సభ్యుల సస్పెన్షన్

Posted: 08/22/2013 02:29 PM IST
11 mps in suspension proposal

పార్లమెంటులో గందరగోళం సృష్టించి సభను సజావుగా సాగనివ్వని తెలుగుదేశం పార్టీ సభ్యులు నలుగురు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏడుగురు సస్పెన్డ్ చెయ్యటానికి ప్రతిపాదన చేయటం జరిగింది. 

స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకెళ్ళి నిరసనలను వ్యక్తం చెయ్యటమే కాక ఒక సందర్భంలో స్పీకర్ మైక్ ని కూడా లాగేసే ప్రయత్నం జరిగింది.  అయితే వారితోపాటుగా తమ స్థానాల్లో ఉండే నిరసన వ్యక్తపరచిన కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కూడా సస్పెన్షన్ జాబితాలో ఉండటం విశేషం.

ఈ 11 మందినీ పార్లమెంటు సమావేశాలు పూర్తయేంతవరకు అంటే 30వ తేదీ వరకు సస్పెన్షన్ లో ఉంచేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమలనాథ్ పార్లమెంటులో ప్రతిపాదన పెట్టారు.  అందుకు కాంగ్రెస్ పార్టీ  ఎన్ సి పి మినహాయించి మిగిలిన అన్ని పార్టీలూ అభ్యంతరాన్ని వ్యక్తపరచాయి. 

ఈ సందర్భంలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ, తాము తెలంగాణాకి అనుకూలమే కానీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల సస్పెన్షన్ ని వ్యతిరేకిస్తున్నామన్నారు.  తాము లోగడ మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసామని, కానీ ఇంత గందరగోళ పరిస్థితి ఎప్పుడూ ఏర్పడలేదని భాజపా నేతలు అన్నారు. 

సస్పెన్షన్ ప్రతిపాదనలో ఉన్ననలుగురు తెలుగుదేశం పార్టీ సభ్యులు- మోదుగుల వేణుగోపాల రెడ్డి, కొనకళ్ళ నారాయణ, శివప్రసాద్, నిమ్మల కృష్ణప్ప, 

సస్పెన్షన్ ప్రతిపాదనలో ఉన్న ఏడుగురు కాంగ్రెస్ పార్టీ సభ్యులు- లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి,  అనంత వెంకటరామరెడ్డి, సాయిప్రతాప్.

సభను గందరగోళ పరిస్థితుల్లో 45 నిమిషాల సేపు వాయిదా వేసిన స్పీకర్ ఆ తర్వాత కూడా సీమాంధ్ర నాయకుల హోరుతో పాటు సస్పెన్షన్ ప్రతిపాదన మీద కూడా నిరసనలు తగ్గకపోయేసరికి సభను రేపటికి వాయిదా వేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles