Three storey building in rajahmundry collapses

Buildign collapse at Rajahmundry, Three stroey building collapses, Building collapses due to adjoining construction, one die in Rajahmundry building collapse

Three storey building in Rajahmundry collapses

రాజమండ్రిలో కూలిన భవనం

Posted: 08/22/2013 10:50 AM IST
Three storey building in rajahmundry collapses

రాజమండ్రిలో రాత్రి 11.45 సమీపంలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం కింద ఒకరు మృతి చెందారు, ఐదుగురు శిథిలాల కింది చిక్కివున్నారు.  రాజమండ్రి మెయిన్ రోడ్ కి దగ్గర్లో ఉన్న నాళం భీమరాజు వీధీలోని మూడు అంతస్తుల భవనం 10 సంవత్సరాల క్రితం నిర్మించినదే.  కింద కిరాణా దుకాణం నడుస్తోందని, పై అంతస్తులో ఒక కుటుంబం నివాసముంటున్నదని తెలిసింది.  శిధిలాల కింద చిక్కుకునిపోయినవారు ఆ కుటుంబ సభ్యులేనని, అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారని అక్కడి స్థానికులు చెప్తున్నారు. 

స్థానికులు చెప్పినదాని ప్రకారం, ఈ భవనానికి ఆనుకునే జరుగుతున్న బహుళ అంతస్తుల భవన నిర్మాణం వలనే ఈ భవనం బలహీనంగా తయారై రాత్రి ఉన్నట్టుండి కుప్పకూలింది.  దానితో పై అంతస్తులోని కుటుంబ సభ్యులంతా శిథిలాల కింద పడిపోయారు.  ఈ దుర్ఘటనకు కారణం కేవలం పక్కన జరుగుతున్న నిర్మాణమేనని స్థానికులు గట్టిగా చెప్తున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles