Targeting political leaders and fastings

Samaikyandhra movement, Targeting political leaders in Samaikyandhra, samaikyandhra fastings, Hunger strikes for Samaikyandhra, Devineni Uma, Dhulipalla Narendra

Targeting political leaders and fastings

నేతల నివాసాల ముట్టడులు, దీక్షలు

Posted: 08/17/2013 12:53 PM IST
Targeting political leaders and fastings

సమైక్యాంధ్ర ఉద్యమకారులు ఉద్యమంలో భాగంగా, కేంద్రం మీద ఒత్తిడి తేలేకపోతున్నందుకు నిరసనగా రాజకీయ నాయకుల నివాసాలను ముట్టడించే ప్రయత్నంలో ఉన్నారు.  

విజయనగరంలో ఉపాధ్యాయ ఐక్య కారాచరణ సమితి నాయకులు పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ ఇంటిని ముట్టడించే ప్రయత్నాన్ని పోలుసులు అడ్డుకున్నారు.  పోలీసులకు ఉపాధ్యాయులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

కర్నూల్ మౌర్య ఇన్ హోటల్ లోని టిజి వెంకటేష్ కార్యాలయాన్ని న్యాయవాదులు ముట్టడించి, వెంకటేష్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేసారు.  

పొన్నూరులో తెలుగుదేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ళ నరేంద్ర నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.  ఉదయం విజయవాడ మైలవరం శాసన సభ్యుడు నిరాహార దీక్షా శిబిరానికి తరలి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని ఆయనను అరెస్ట్ చేసారు.  తోపులాటలు, లాఠీ చార్జీలు జరిగాయి.  దానితో తెదేపా విజయవాడ బంద్ కి పిలుపునిచ్చింది.  దుకాణాలను మూసివెయ్యటం జరుగుతోంది.  దీక్షాస్థలాన్ని వేరేచోటికి మార్చే ఉద్దేశ్యంలో తెదేపా నేత చంద్రబాబు నాయుడిని దేవినేని సంప్రదిస్తున్నారు.  

తిరుపతిలో జరుగుతున్న రిలే దీక్షలలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, సమైక్యాంధ్ర జెఏసి, సమైక్యాంధ్ర ఐకాస మున్సిపల్, ఏపి ఎన్జీవో, ఎస్ వి, న్యాయవాదుల ఐకాస భాగస్వామ్యం వహిస్తున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles