Devineni uma arrest

devineni Uma Arrest, Telugu Desam party, TDP leader Devineni Uma, Devineni Uma Hunger strike, Lal Jan Bash dead, Bonda Uma hunger strike

devineni Uma Arrest

దేవినేని ఉమ అరెస్ట్

Posted: 08/17/2013 10:54 AM IST
Devineni uma arrest

నిరవధిక నిరాహార దీక్షకు ఉపక్రమించిన దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేసారు. 

సమైక్యాంధ్రకు మద్దతుగా నిన్నటి నుంచే నిరాహార దీక్షకు పూనుకున్న విజయవాడ మైలవరం శాసన సభ్యుడు, తెలుగు దేశం పార్టీ నాయకుడు దేవినేని ఉమామహేశ్వర రావు తెదేపా ఉపాధ్యక్షుడు లాల్ జాన్ బాషా అకాల మరణం వలన దీక్షను ఈ రోజు నుంచి చెయ్యటానికి వాయిదా వేసుకున్నారు.   అయితే పోలీసులు దీక్షకు అనుమతి లేదని చెప్పారు.  అయినా దేవినేని దీక్షకు అన్ని విధాల ఏర్పాట్లు చేసుకుని, ఉదయం గొల్లపూడి లోని తన నివాసం నుంచి బందర్ రోడ్ లోని దీక్షాస్థలి కి బయలు దేరారు.  కార్యకర్తలతో కలిసి పాద యాత్ర చేస్తూ దీక్షాస్థలికి చేరుకోబోతున్న ఉమ ను పోలీసులు అడ్డుకోబోగా పోలీసులు, మద్దతుదారుల మధ్య జరిగిన తోపులాట దరిమిలా లాఠీ చార్జిల వలన పరిస్థితి ఉద్రిక్తంగా మారినా అదుపులోకి వచ్చింది. 

దేవినేని ఉమను పోలీసులు మాచవరం పోలీస్ స్టేషన్ కి తరలించారు.  అలాగే, నిరాహార దీక్షకు సిద్ధమైన తెదేపా కార్యదర్శి బోండా ఉమ ను కూడా పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేసారు.

ఎన్నికల కోడ్ సాకుతో శాంతియుతంగా జరుగుతున్న దీక్షను భంగం చేసారని, అదంతా ముఖ్యమంత్రి ఆదేశాలతోనే జరుగుతున్నదని తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య అన్నారు.  పోలీసు చర్యలు తెలుగు దేశం పార్టీలు ఉద్యమ నాయకులు కొందరు తప్పు పట్టారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles