Minister vishwaroop fire on seemandhra mps

Minister Vishwaroop fire on Seemandhra Mps, Minister Vishwaroop, seemandhra Mps, sonia gandhi

Minister Vishwaroop fire on Seemandhra Mps, Minister Vishwaroop, seemandhra Mps, sonia gandhi

మంత్రి గారి మాటల విశ్వరూపం

Posted: 08/14/2013 06:56 PM IST
Minister vishwaroop fire on seemandhra mps

తెలంగాణ విభజన అంశం పై సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులకు, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలకు మధ్య విభేదాలు తారా స్థాయికి చేరేటట్లే కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు మంత్రులు ఎంపీల పై గుర్రుగా ఉంటే తాజాగా మరో మంత్రి విశ్వరూప్ సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల పై తన మాటల విశ్వరూపాన్ని చూపించాడు. లోక్‌సభలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సోనియా ఉంటే ఒకలా...లేకపోతే మరోలా ప్రవర్తిస్తున్నారని, ఎంపీల తీరును ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాగ్రహానికి గురికాక తప్పదని టీడీపీ, బీజేపీ మద్దతు ఇచ్చినంత మాత్రాన తెలంగాణపై సీడబ్ల్యూసీ తీర్మానం సరికాదన్నారు. కోర్ కమిటీ భేటీకి తరువాత సీమాంధ్రులతో చర్చించి, వారి అభిప్రాయాలు సేకరించి సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదని అన్నారు. తీర్మానానికి ముందే ఆంటోని కమిటీ వేయాల్సిందని...ప్రభుత్వపరమైన కమిటీ వేస్తే ఇంకా బాగుండేదని పేర్కొన్నారు. మంత్రి విశ్వరూప్ మాటల పై ఎంపీలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles