Address issues before andhra partition cm kiran

Congress Working Committee, State Burcation, Kiran Kumar Reddy, State Bifurcaiton, Congress

Pointing finger at the Congress leadership for its decision to create Telangana by splitting Andhra Pradesh, chief minister Kiran Kumar Reddy

అధిష్టానానికి కిరణ్ సూటి ప్రశ్నలు

Posted: 08/09/2013 08:06 AM IST
Address issues before andhra partition cm kiran

కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పై ప్రకటన చేసినప్పటి నుండి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌన వ్రతం పట్టిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎట్టకేలకు తొమ్మిది రోజుల తరువాత తన మనస్సులోని మాటలను బటయ పెట్టాడు. ఇన్ని రోజులు ఏం మాట్లాడాలి ? ఏం చేయాలి అని మదన పడుతూ అన్ని విషయాల పై ఆలోచించి అధిష్టానం మాటకన్నా తన మనస్సాక్షి మాటే వినాలనుకొని నిర్ణయించు కొని మీడియా ముందు  కు వచ్చి నోరు విప్పారు. రాష్ట్ర విభజనతో తలెత్తే సాగునీరు, విద్యుత్తు, హైదరాబాద్, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వంటి సమస్యలపై రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని.. వాటిపై అసెంబ్లీలోనూ కూలంకషంగా చర్చలు చేశాకనే విభజనపై ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. విభజనతో ఇరు ప్రాంతాల మధ్య ఈ అంశాలు పెను సమస్యలు సృష్టిస్తాయన్నారు. ఓ చిన్న సమస్యను పరిష్కరించటానికి మరో అతిపెద్ద సమస్యను సృష్టిస్తారా? సమస్యలను పరిష్కరించటానికి బదులు మరిన్ని పెంచేలా చేస్తారా? అంటూ పరోక్షంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తప్పుపట్టారు. విభజనతో సాగునీరు, విద్యుత్తు, రాజధాని అంశాలపై అనేక సమస్యలు వస్తాయని.. వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. వీటన్నింటి గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి తను తెలంగాణ విషయంలో వాదించడం లేదని సమస్యలు వస్తాయని వాటిని పరిష్కరించాకే కేంద్రం తెలంగాణ పై నిర్ణయం తీసుకోవాలని అధిష్టానానికి సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles