Ex minister uppunutula passes away

uppunutula passes away, Uppunutula Purushothama Reddy, Formar Minister Uppunutula died, AP Chief Minister Brahmananda Reddy, AP Chief Minister Jalagam Vengala Rao, AP Development Corporation

Ex minister uppunutula passes away

ఉప్పునూతుల పురుషోత్తమ రెడ్డి కన్నుమూత

Posted: 08/03/2013 10:55 AM IST
Ex minister uppunutula passes away

మాజీ మంత్రి ఉప్పునూతుల పురుషోత్తమ రెడ్డి ఈరోజు ఉదయం అంతిమ శ్వాసను విడిచారు.  80 సంవత్సరాల ఉప్పునూతుల మెదడుకి సంబంధించిన రుగ్మతతో అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.  ఈ రోజు ఉదయం 5.15 గంటలకు హాస్పిటల్ లోనే ఆయన మృతిచెందారు. 

ఎంతోకాలంగా కాంగ్రెస్ పార్టీకి సేవచేసి బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో ఎమ్మెల్సీగా పనిచేస్తూ చిన్ననీటి వనరులు, ఆబ్కారీ శాఖల మంత్రిత్వ బాధ్యతలను చేపట్టిన ఉప్పునూతుల రామన్నపేట నుంచి రెండుసార్లు శాసనసభకు ఎన్నికైన ఉప్పునూతుల డెయిరీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కి, ఏపిఐఐసి కి ఛైర్మన్ గా వ్యవహరించారు.  అయితే కొంతకాలం క్రితం ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

ఆయన భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలను శోకసాగరంలో ముంచి ఈరోజు కన్నుమూసారు.  రాజకీయనాయకులు ఆయన మృతికి కుటుంబసభ్యులకు సంతాపాన్ని తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles