Kcr comments make hurdles in t formation

KCR Comments Fans Fumes, AP Employees union, KCR asks Andhras Employees to leave, Andhra Employees no option but leave, Telangana Employees get increment

kcr comments make hurdles in T formation

కెసిఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనక అంతర్యం

Posted: 08/03/2013 10:24 AM IST
Kcr comments make hurdles in t formation

తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు వ్యాఖ్యలకు దెబ్బతిన్న ఆంధ్ర ప్రభుత్వోద్యోగులు ఈరోజు విధులను బహిష్కరిస్తూ మెరుపు సమ్మెకు పిలుపునిచ్చారు. 

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ తన సమ్మతిని వెల్లడించిన సందర్భంగా నిన్న తెలంగాణా భవన్ లో కెసిఆర్ ని అభినందించటానికి వచ్చిన ఉద్యోగ సంఘాల నేతల సమక్షంలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు సమైక్యాంధ్ర ఉద్యమకారులను రెచ్చగొట్టాయి.

ఇక ఆంధ్ర ఉద్యోగులకు ఇక్కడ తావు లేదని, తెలంగాణా రాష్ట్రం ఏర్పడగానే వాళ్ళు తమ గూటికి పోవటం తప్ప వేరే మార్గం ఏమీ లేదని కెసిఆర్ అన్నారు.  దానిమీద స్పందిస్తూ, అసలీ కెసిఆర్ ఎవరీ మాట అనటానికి అంటూ ఆంధ్ర ఉద్యోగసంఘ నేతలు మండిపడ్డారు. 

మెదక్ పార్లమెంటు సభ్యురాలు, తెరాస రెబల్ నాయకురాలు విజయశాంతి కెసిఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు.  ఈ సందర్భంలో కెసిఆర్ వ్యాఖ్యలు తెలంగాణా ఏర్పాట్లకి విఘాతం కలిగించేలా ఉన్నాయంటూ ఆమె అభ్యంతరం తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కూడా అవే అభిప్రాయాలను వెల్లడించారు.

అయితే కెసిఆర్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిధంగా ఉన్నా, ఆయన దిష్టి బొమ్మను తగలబెట్టటం, ఆయన్ని తిట్టటం చేసిన ఆంధ్రా వాసులకు, నాయకులకు ఖబర్దార్ మీ వాళ్ళ ఆయువు పట్టు నా దగ్గరేవుంది అన్న సంకేతాలను కూడా ఇస్తున్నాయి. అంతేకాదు, ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణాకు సరేననటంతో కెసిఆర్ తన రాజకీయ శక్తిని కూడదీసుకోవటానికి, కొత్త రాష్ట్రం మీద పట్టు సాధించటానికి కూడా ఈ వ్యాఖ్యలు చేసివుండవచ్చని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles