Trs to suspend medak mp vijayashanti for anti party activities

trs to suspend vijayashanti, Medak MP Vijayashanti suspend, vijayashanti suspend, trs to suspend vijayashanti, kcr party to suspend vijayashanti, kcr vs vijayashanti, telangana state, congress party, vijayashanti for anti-party activities, ramulamma suspend,

TRS to suspend Medak MP Vijayashanti for anti-party activities

రాములమ్మను బయటకు నెట్టిన కేసిఆర్

Posted: 08/01/2013 08:46 AM IST
Trs to suspend medak mp vijayashanti for anti party activities

తెలంగాణ రాములమ్మను టీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసిఆర్. అన్న చెల్లెల అనుంబంధాన్ని పై వేటు వేయ్యటానికి కేసిఆర్ సిద్దమైనట్లు సమాచారం. కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే వార్తలు వెలువడిన నేపథ్యంలో మెదక్ ఎంపీ విజయశాంతిని టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. అర్ధరాత్రి 12.30 తర్వాత కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పోలిట్‌బ్యూరో సభ్యులతో చర్చించిన పిదపే... పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విజయశాంతిని సస్పెండ్ చేయాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారని టీఆర్‌ఎస్ వర్గాలు వివరించాయి. ఆమె పలుమార్లు పార్టీకి వ్యతిరేకంగా వెళ్లినా, మాట్లాడినా క్షమించామని... ఈసారి మాత్రం చర్య తీసుకోక తప్పదని కేసీఆర్ భావించినట్లు సమాచారం. కొంతకాలంగా విజయశాంతి టీఆర్‌ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో టచ్‌లో ఉన్న ఆమెకు మెదక్ టిక్కెట్టుపై హామీ లభించినట్లు పేర్కొంటున్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రకటనతో తెలంగాణ వాదులు, టీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగితేలగా... రాములమ్మ ఎక్కడా కనపడలేదు. పైగా ఆమె ఇంటివద్ద కేసీఆర్ పోస్టర్ల స్థానంలో ఉన్నట్లుండి ఇందిరాగాంధీ చిత్రపటాలు వెలిశాయి. ఆమె కాంగ్రెస్‌లోకి వెళుతున్నట్లుగా తనకెలాంటి సమాచారం లేదని సమావేశంలో చెప్పిన కేసీఆర్... విజయశాంతి కదలికలను ధ్రువీకరించుకొని మరుసటిరోజే సస్పెండ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. పార్టీ నుంచి బహిష్కరించే ముందు ఎందుకు చర్య తీసుకోకూడదో తెలపాలంటూ టీఆర్‌ఎస్ ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేయనుంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles