Vijayashanthi very happy about telangana decision

Telangana,TRS,vijaya santhi, Medak MP, TRS Party leader, Congress leader

Vijayashanthi Very Happy About Telangana Decision.

టి. ఏర్పాటు రాజకీయ పార్టీల ఫలితం కాదు..

Posted: 07/31/2013 10:58 PM IST
Vijayashanthi very happy about telangana decision

తెలంగాణ రాష్ట్రసమితి నాయకురాలు,  మెదక్ ఎంపీ విజయశాంతి టీఆర్ఎస్ పార్టీకి జలక్ ఇస్తుందనే వార్తలకు మరింత బలం చేకూరాయి ఆమె గత కొద్ది సేపటి క్రితం చేసిన వ్యాఖ్యలు. ఇప్పటికే రాములమ్మ టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెతుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గత కొంత కాలం నుండి పార్టీకి దూరంగా ఉంటున్న రాములమ్మ నిన్న కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించిన తరువాత కూడా ఆ పార్టీ నేత కేసీఆర్ ని కలవకుండా సొంతంగా వివిధ మీడియాలకు ఇంటర్యూలు ఇచ్చింది.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూల నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంగా తెలంగాణ భవన్ అంతటా భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నా.. రాములమ్మ మాత్రం వాటికి దూరంగానే ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ 13 ఏళ్ల నుంచి పోరాడుతుంటే, తాను 16 ఏళ్లుగా కష్టపడుతున్నానని, రాజకీయ పార్టీలకన్నా.. త్యాగాలు చేసినవారికే క్రెడిట్‌ ఇవ్వాలని ఆమె చెప్పారు. ఈ ర్రెడిట్ టీఆర్ఎస్ పార్టీకి కాకుండా, రాజకీయ పార్టీలకు కాకుండా చెప్పడం వెనుక ఏదో ఉందని అంటున్నారు. ఈ సందర్భంగా ఆమె తాను కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం పై చెప్పక పోవడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles