Mp lagadapati rajagopal exit in politics

MP Lagadapati Rajagopal Exit In Politics , rajagopal political exit, Lagadapati Resignation, Telangana Issue, sonia gandhi

MP Lagadapati Rajagopal Exit In Politics , rajagopal political exit, Lagadapati Resignation, Telangana Issue, sonia gandhi

లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం ?

Posted: 07/31/2013 09:17 PM IST
Mp lagadapati rajagopal exit in politics

తెలంగాణ పై ఆందోళనలు, బంద్ లు, కోర్ కమిటీ భేటీలు జరుగుతున్నంత సేపు తెలంగాణ పై అధిష్టానం నిర్ణయం తీసుకొదని, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయదని, సమైక్యంగానే ఉంచుతుందని జోస్యాలు చెబుతూ వచ్చిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు సోనియా తెలంగాణ ఇచ్చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో లగడపాటి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అని రాజకీయ వర్గాలు, విజయవాడ వాసులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. గతంతో ఈయన కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే ‘తాను శాశ్వత రాజకీయ సన్యాసం చేస్తానని ’ గతంలో సవాల్ చేశారు. మరి ఇప్పుడు తెలంగాణ ఇచ్చేయని, దానికి సంబంధించిన ప్రక్రియ కోసం అమ్మ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈయన చేసిన సవాల్ పై చర్చ ప్రారంభం అయింది. నిన్న రాత్రి రాష్ట్ర ప్రకటన అనంతరం మీడియాతో మాట్లాడిన లగడపాటి సీమాంధ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, సమైక్య రాష్ట్రానికే ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని, అసెంబ్లీలో, పార్లమెంటు బిల్లుల్లో చూసుకుందామని అన్నాడు. కానీ అధిష్టానం సాధారణ మెజారిటీ ఉంటే చాలని చెప్పడంతో లగడపాటి ఇప్పుడు ‘రాజకీయ సన్యాసం ’ చేయబోతున్నారా ? లేక తక్షణమే తన పదవికి రాజీనామా చేయబోతున్నారా ? అనే దాని పై అక్కడి వారు చర్చించుకుంటున్నారు. మొదటి నుండి లగడపాటి మాటంటే మాటే అనే పేరు తెచ్చుకున్న ఇతను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాని కొందరు అంటుంటే, రాజకీయ నేతలు చెప్పిన మాట పై ఎప్పుడు నిలబడరని మరి కొందరు అంటున్నారు. మరి లగడపాటి ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడనేది ఆసక్తిగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles