Mim owaisi accepts telangana decision

MIM accepts Telangana decision, Asaduddin Owaisi, Asaduddin Owaisi,urdu,Official Language, BJP Party

MIM president and Hyderabad MP Asaduddin Owaisi said that his party accepts the decision taken by the Congress-led UPA Government to bifurcate Andhra Pradesh to carve out Telangana State.

తెలంగాణ నిర్ణయంతో బీజేపీకే లాభం

Posted: 07/31/2013 09:00 PM IST
Mim owaisi accepts telangana decision

తెలంగాణకు ఇన్ని రోజుల నుండి వ్యతిరేకంగా మాట్లాడిన మజ్లిస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రం ప్రకటించడంతో కొత్త రాష్ట్రం ఏర్పాటు తధ్యమని తేలిన తరువాత వ్యతిరేకించడానికి ఏముంటుందని, తెలంగాణ ప్రకటనను తాము వ్యతిరేకించబోమని మజ్లిస్ పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తెలంగాణ ఇవ్వడం వల్ల భారతీయ జనతా పార్టీకీ లాభం చేకూరుతుందని అన్నారు. ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లు భవిష్యత్‌లో రెండు రాష్ట్రాల్లోనూ అమలు చేయాలన్నది తమ డిమాండని ప్రకటించారు.  తెలంగాణ రాష్ట్రంలో తెలుగుతో సమానంగా ఉర్దూ భాషను అధికార భాషగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో రెండో అధికార భాషగా ఉర్టూను ప్రకటించాలని అన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో భాజాపాను నిలవరించాలంటే తాము అధికంగా కష్టపడాల్సి ఉంటుందని అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు చేయాలనుకుంటే సౌరాష్ట్ర, విదర్భ, బుందేల్ ఖండ్ ఇలా చిన్న రాష్ట్రాల డిమాండ్లు చాలా ఉన్నాయని అన్నారు.  రెండు రాష్ట్రాల్లోనూ తమ పార్టీ శాఖలుంటాయని తెలిపారు.  హైదరాబాద్‌ నగర దాహార్తిని తీర్చేందుకు, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పోలవరం తరహాలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు  జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని అసదుద్దీన్‌ కోరారు. ఇక తెలంగాణేతురలు అనే పదప్రయోగాన్ని కూడా నిషేదించాలని, నేరంగా పరిగణించాలని ఆయన సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles