Ysr statue set on fire in guntur

YSR statue set on fire, YSR Statue in Gunturu, MLA Sucharita, YSR Congress party, YSRCP Guntur Appireddy

ysr statue set on fire in guntur

గుంటూరులో టెన్షన్

Posted: 07/16/2013 02:42 PM IST
Ysr statue set on fire in guntur

గుంటూరులో కొరటిపాడు, రెడ్డిపాలెం ప్రాంతాల్లో వైయస్ఆర్ విగ్రహాలకు గుర్తు తెలియని అగంతకులు నిప్పు పెట్టారు. 

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల మీద కిరోసిన్ పోసి తగలపెట్టటంతో ఆ ప్రాంతంలో జనమంతా భయాందోళనకు గురౌతున్నారు.

విషయం తెలియగానే వైయస్ఆర్ పార్టీ నగర నాయకుడు లెల్లా అప్పిరెడ్డి మరికొందరు మద్దతుదారులతో కలిసి హుటాహుటిన కొరటిపాడులోని విగ్రహాన్ని సందర్శించి, ఆ తర్వాత నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.  ప్రత్తిపాడు శాసనసభ్యురాలు ఎమ్.సుచరిత కూడా నిరసనలో పాల్గొనటంతో పరిస్థితి ఇంకా ఉద్విగ్వంగా మారింది.  అక్కడి నుండి రెడ్డిపాలెం కూడా వెళ్ళి అక్కడ ధ్వంసమైన విగ్రహాన్ని కూడా చూసారు. 

అయితే పార్టీ సభ్యులను ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పే విధంగా ఎటువంటి చర్యలూ చేపట్టవద్దని, ఎవరిన్ని విధాలుగా రెచ్చగొట్టినా ప్రతీకారం తీర్చుకునే దిశగా ఆలోచించకుండా సంయమనాన్ని పాటించవలసిందిగా నాయకులు కోరారు.

సుచరిత, అప్పిరెడ్డి ఇద్దరూ జరిగిన సంఘటనను ఖండిస్తూ నేరానికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles