Ottavio quattrochhi of bofors case dead

Ottavio Quattrochhi, Bofors company, Quattrochhi dead, Rajiv Gandhi, Congress Party, Italy businessman Quattrochhi, CBI

ottavio quattrochhi-of-bofors-case-dead

ఖత్రోచి మరణం

Posted: 07/14/2013 10:32 AM IST
Ottavio quattrochhi of bofors case dead

బోఫోర్స్ కేసులో ప్రధాన నిందితుడు, వ్యాపారవేత్త ఒట్టావియో ఖత్రోచి (74) ఇటలీ లోని మిలాన్ నగరంలో శుక్రవారం నాడు మరణించారు. 

1986లో భారత రక్షణ శాఖ రూ.1437 కోట్ల రూపాయలు వెచ్చించి చేసిన హోవిట్జర్ శతఘ్నుల కొనుగోళ్ళలో ముడుపులు అందాయన్న విషయం బయటపడటంతో కాంగ్రెస్ పార్టీకి అది ఒక పెద్ద మచ్చలాగా తయారై రాజకీయరంగంలో ఒక అడ్డంకిగానూ, ప్రతిపక్షాలకో ఆయుధంగానూ తయారైంది.

హోవిట్జర్ శతఘ్నులను భారత్ కి అమ్మిన బోఫోర్స్ కంపెనీ ఆ ఒప్పందం కోసం భారత్ లో ఖత్రోచి ద్వారా ముడుపులు అందజేసిందన్న ఆరోపణ మీద సిబిఐ దర్యాప్తు చేపట్టింది.  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అతని కుటుంబ సభ్యులకు సన్నిహితుడైన ఖత్రోచి ద్వారా రాజీవ్ గాంధీ కి లంచం అందిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి.  వాటి మీద తన దగ్గర ఆధారాలున్నాయంటూ ఆ తర్వాత ప్రధానమంత్రి గా పనిచేసిన విశ్వనాథ ప్రతాప్ సింగ్ కూడా ప్రకటించారు.  మొత్తానికి కాంగ్రెస్ ని బాగా ఇరకాటంలో పెట్టిన బోఫోర్స్ కేసులో రాజీవ్ గాంధీ లేరు, ఇప్పుడు ప్రధాన నిందితుడైన ఖత్రోచి కూడా శుక్రవారం మరణించారు. 

సిబిఐ దర్యప్తు ముమ్మరంగా సాగుతుండగా 1993 లో భారతదేశం నుండి విదేశాలకు జారుకున్న ఖత్రోచి భారత్ లో అరెస్ట్ ను తప్పించుకున్నారు.  ఆ తర్వాత వివిధ దేశాలలో తలదాచుకున్నారు.  సిబిఐ ఆయనను పట్టుకోలేకపోయింది.  అయితే పట్టుకోలేక పోవటం కాదని, ఖత్రోచి ఏ దేశాలలో ఉన్నారో ఆ దేశాలకు సరైన విధంగా అభ్యర్థనను పంపించకపోవటం కేసు దర్యాప్తును కావాలనే తాత్సారం చేసారంటూ సిబిఐ మీద ఆరోపణలు కూడా వచ్చాయి.  మొత్తానికి ఇప్పుడు బోఫోర్స్ కి పూర్తిగా తెరపడింది.

అయితే విచిత్రమేమిటఁటే, కేసులో ఏమీ తేలలేదు, ఎవరినీ పట్టుకోలేదు ఎటువంటి డబ్బునూ వెనక్కి రప్పించుకోలేదు కానీ 64 కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పుకున్న కేసు పరిశోధనకు మాత్రం 250 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి

ఖత్రోచి అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles