Mopidevi venkataramana likely to join ysrcp

Mopidevi join YSRCP, Mopidevi,Jagan,Congress,YSRCP,Harnath Babu,Repalle,

There is no surprise in this. Since last 13 months Former Minister Mopidevi Venkata Ramana personally with YS Jagan in Chanchalguda prison on Disproportion of assets case. Now Mopidevi brother Harnath babu and his associates will likely to be joins in YSRCP in presence of Vijayamma in this week.

మోపిదేవి వెంకటరమణ వైకాపాలోకి ?

Posted: 07/03/2013 09:41 AM IST
Mopidevi venkataramana likely to join ysrcp

రేపల్లె శాసనసభ్యుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆయన వర్గం కాంగ్రెస్ పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. మోపిదేవి గత ఏడాదికి పైగా చంచల్ గూడ జైలులో జగన్ అక్రమ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్నారు. కళంకితుల జాబితాలో ఉన్న మిగతా మంత్రుల విషయంలో ఒకలా, తన విషయంలో ఒకలా స్పందించారని కాంగ్రెస్ తీరుపై మోపిదేవి తీవ్ర అసంతృప్తి, మనస్తాపంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తనను రక్షిస్తానని చెప్పి చెయ్యిచ్చిందని ఆయన వర్గీయులంతా భావిస్తున్నారు.కనీసం బెయిల్ రావడానికి కూడా వీరు సహకరించడం లేదని వారు బాధపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆయన సోదరుడు హరినాదబాబు ,ఇతర అనుచరులంతా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరుతున్నారు. కాగా గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ అధిష్ఠానం.. రేపల్లె నియోజకవర్గాన్ని ఖాళీగా ఉంచింది. రెండు రోజుల క్రితం మోపిదేవి కుటుంబీకులు, వెంకటరమణతో ములాఖత్ అయ్యి.. వైసీపీలో చేరే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రెండు మూడు రోజుల్లో జైలులో జగన్ సమక్షంలో మోపిదేవి, ఆ తర్వాత విజయలక్ష్మి సమక్షంలో మోపిదేవి భార్య, సోదరుడు చేరనున్నట్టు సమాచారం. ఈయన అరెస్టు అయిన వాన్ పిక్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తన వైఖరి చెప్పకపోవడం కూడా మోపిదేవికి ఇబ్బందిగా ఉంది. కాగా అనారోగ్యంతో బాధపడుతున్న మోపిదేవిని నిమ్స్ కు ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles