Political samkhyandhra jac protesters attacked on digvijay singh

samkhyandhra jac protesters attacked on digvijay singh, digvijay singh, congress party, samkhyandra jac, congress ministers,

samkhyandhra jac protesters attacked on digvijay singh

డిగ్గీకి సమైక్య సెగ

Posted: 07/01/2013 11:56 AM IST
Political samkhyandhra jac protesters attacked on digvijay singh

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌కు సమైక్య సెగ తాకింది. రాష్ట్ర ఇన్‌చార్జిగా తొలిసారిగా డిగ్గీ రాజా విశాఖలో పాదం మోపారు. విమానా శ్రయంలో ఆయన పాదం మోపీ మోపకముందే సమైక్యవాదాన్ని బలంగా వినిపించే సొంత పార్టీ నేతలు గాదె వెంకటరెడ్డి, శైలజానాథ్‌, గంటా శ్రీనివాసరావు ఎదురెళ్లి స్వాగతం పలికి రాష్ట్రాన్ని విభజించ వద్దని వినతిపత్రాన్ని అందించారు. రాష్ట్రాన్ని విభజించడం వల్ల ఎదురయ్యే సమస్యలతో పాటుగా విభజన, సమైక్యవాదాల గత చరిత్రను, నడుస్తున్న చరిత్రను, భవిష్యత్‌ పరిణామాలను శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పొందుపరిచిన అంశాలను ఏకరువు పెట్టారు. మరోవంక సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపి స్తున్న పొలిటికల్‌ విద్యార్థి జేఏసీలతో పాటుగా వివిధ ప్రజాసంఘాలు డిగ్గీ రాజాను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఇలా తొలి అడుగులోనే దిగ్విజయ్‌సింగ్‌కు సమైక్య సెగ తాకింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles