Political mla veera siva reddy comments on dl ravindra reddy

mla veera siva reddy, ex minister dl ravindra reddy, veera siva reddy vs dl, congress party, cm kiran kumar reddy, chalo assembly, breaking news, ap politics, political news, andhra news

Mla Veera Siva Reddy Comments on DL Ravindra Reddy

నచ్చితే ఉండు.. డీఎల్ నచ్చకపోతే జైలుకే..

Posted: 06/15/2013 03:54 PM IST
Political mla veera siva reddy comments on dl ravindra reddy

35 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ సేవా చేస్తున్న మాజీ మంత్రి ఢిఎల్ రవీంద్రారెడ్డి పరిస్థితి రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీలో దిగజారిపోతుంది. అసెంబ్లీలోను ఆయనకు అవమానం జరిగింది. తన ఎమ్మెల్యే సీటును ఎక్కడో ఒక మూలన ఇవ్వటం జరిగింది. ఆయన కు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. అసలే పుండు అయితే .. దాని మీద ప్రతి నిమిషానికి కారం చల్లి .. ఆనందం చూస్తే కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఒకరు. ఆయన ఢిఎల్ ను టార్గెట్ చేసుకోని కామెంట్ చేస్తున్నారు. ఈరోజు ఢిఎల్ కు మరో కామెంట్ విసిరారు. ఢీఎల్ నచ్చితే పార్టీలో ఉండు..నచ్చకపోతే జైలుకే.. అని వీరశివారెడ్డి అన్నారు. అంతేకాకుండా మరో అడుగుకు ముందుకేసి , కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించకపోతే డీఎల్ కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవచ్చని ఆయన అన్నారు. చలో అసెంబ్లీ విషయంలో కిరణ్ సర్కార్ కు అప్రతిష్ట రావాలని డీఎల్ కోరుకున్నారని వీరశివారెడ్డి ఆరోపించారు. అయితే అది జరగకపోగా హైకమాండ్ పెద్దలు మెచ్చుకోవటంతో డీఎల్ కు కడుపు మండిందని ఆయన వ్యాఖ్యానించారు. డీఎల్ ఓఎస్ డీపై ఏసీబీ విచారణ జరుగుతోందని...దానిలో డీఎల్ అవినీతి బయటపడుతుందని అన్నారు. ఆ కేసులో డీఎల్ రవీంద్రారెడ్డి కూడా జైలుకు వెళతారని వీరశివారెడ్డి వ్యాఖ్యలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles