Rtc online booking scam in vizianagaram

rtc online booking scam, fraud in rtc online ticket reservation, vijayanagaram agents cheats, rtc online reservation scam,

RTC online booking scam in Vizianagaram

ఆర్టీసీ ఆన్ లైన్ బుకింగ్ కుంభకోణం..

Posted: 05/29/2013 06:30 PM IST
Rtc online booking scam in vizianagaram

ఆర్టీసీ ఆన్ లైన్ రిజర్వేషన్లలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లికి గరివిడి ప్రాంతానికి చెందిన రోడ్డు రవాణా సంస్ధ(ఆర్టీసీ) అద్దె ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సెంటర్ లో భారీ కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గరివిడికి చెందిన గుడిపాటి సింహాచలం అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఆన్ లైన్ సెంటర్ నుంచి విజయనగరం డిపోకు చెందిన ఐడి, పాస్ వర్డ్ దొంగిలించి సుమారు 6 లక్షల రూపాయలు ఆర్టీసీకి టోకరా వేశారు. హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో జరిపిన ఆన్ లైన్ తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. దీంతో విస్మయానికి గురైన ఆర్టీసీ అధికారులు విజయనగరం జిల్లా పోలీసులకు, సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సిసిఎస్ పోలీసులు అక్రమాలకు పాల్పడ్డ ఆన్ లైన్ సెంటర్ పై కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రవాణా మంత్రి సొంత నియోజకవర్గంలో ఇటువంటి సంఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. మంత్రికి సన్నిహితుడుగా ఉన్న వ్యక్తికి చెందిన ఆన్ లైన్ సెంటర్ లో ఈ కుంభకోణం వెలుగుచూడడంపై పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఈ వ్యవహారంతో రాష్ట్రవ్యాప్తంగా మ్యానువల్ టాపవ్ ద్వారా టికెట్లు జారీచేసే పద్దతిని ఆర్టీసీ రద్దు చేసింది. జూన్ ఒకటి నుంచి నెట్ బ్యాంకింగ్ ద్వారా టికెట్లు జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles