Cm kiran green signal for 34 450 govt jobs

CM Kiran Green Signal for 34,450 Govt Jobs

CM Kiran Green Signal for 34,450 Govt Jobs

కిరణ్... ఓట్ల ఉద్యోగాల జాతర

Posted: 05/24/2013 10:20 AM IST
Cm kiran green signal for 34 450 govt jobs

అసలే ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడికి జనాలు అల్లాడి పోతున్నారు.... ఇలాంటి ఎండల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి యువతకు చల్లని కబురు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీపీఎస్సీ, పోలీసు నియామక బోర్డు, డీఎస్సీల ద్వారా మొత్తం 34,450 ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు తన కార్యాలయంలో వున్న ఫైల్‌ను సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి పాస్‌ చేశారు. దీంతో ఎంతో మంది నిరుద్యోగులకు ఎప్పటి నుండో చూస్తున్న కలలు సాకారం అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇవే కాకుండా మరో 80 వేల ఉద్యోగాలను కూడా ప్రభుత్వం సృష్టించే దిశగా కసరత్తు చేస్తుంది. ఈ ప్రక్రియ అతి త్వరలోనే జరిగేలా చూడాలని, త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే కిరణ్ ఇంత తొందరగా నిర్ణయాలు తీసుకోవడం వెనక పెద్ద ప్లానే ఉందని అంటున్నారు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో యువతను ఆకర్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మరి యువత కిరణ్ కి ఏ మాత్రం ఓట్లు వేస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles