Political mp rayapati sambasiva rao comments

mp rayapati sambasiva rao, guntur mp rayapati sambasiva rao, congress party, karnataka election, congress ministers, dharmana prasad, sabitha indra reddy, sonia gandhi, delhi leaders, 2014 election, jagan case

mp rayapati sambasiva rao comments

ఆదేశాలతోనే రాజీనామా: రాయపాటి

Posted: 05/23/2013 03:35 PM IST
Political mp rayapati sambasiva rao comments

గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు మీడియా ముందుకు వచ్చారు. తారా చౌదరి పుణ్యమా అని రాయపాటి మీడియాలో మంచి ఇమేజ్ సంపాదించు కున్నాడు. ఈ వయస్సులో తారా చౌదరితో సుఖభోగాలు అనుభవించాడో లేదో గానీ, మొత్తం మీద నేషనల్ మీడియా రాయపాటిని బాగానే గుర్తుపెట్టుకుంది.

అసలే అవినీతి మరకలు పడి, అమ్మ ఆగ్రహానికి బలైన మంత్రులపై రాయపాటి కామెంట్ చేశారు. అధిష్టానం ఆదేశాలతోనే మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి పదవులకు రాజీనామా చేశారని కాంగ్రెస్ నేత, ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన ముగ్గురు మంత్రుల సంగతి కూడా అధిష్టానమే చూసుకుంటుందని ఆయన చెప్పారు.

వివాదస్పద 26 జీవోల వ్యవహారంలో ధర్మాన, సబిత పేర్లను సీబీఐ చార్జిషీట్ లో పేర్కొనడంతో వారిద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందేనని అన్నారు. రూ.500 తీసుకొని ప్రజలు ఓట్లు వేస్తే రాజకీయాలు ఇలాగే ఉంటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు అనేది నాయకులలో రాదని, ప్రజల నుండే మార్పు రావాలన్నారు. ప్రజలు డబ్బులు తీసుకొని ఓటు వేయడం మానుకోవాలని అభిప్రాయపడ్డారు. కర్నాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెసు పార్టీకి కనువిప్పు కలిగించేవేనని చెప్పారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles