Political murli manohar joshi comment on manmohan singh

murli manohar joshi, bjp senior leader murli manohar joshi, prime minister manmohan singh, congress party, bjp, congress president sonia gandhi, manmohan singh resignation, bjp demand for pm resignation

murli manohar joshi comment on manmohan singh

ఆయన రాజీనామా దేశానికి మేలు

Posted: 05/15/2013 09:30 AM IST
Political murli manohar joshi comment on manmohan singh

ప్రధాని మన్మోహన్‌సింగ్ ఎంత త్వరగా రాజీనామా చేస్తే దేశానికి అంత మంచిది అని పిఎసి చైర్మన్, బిజెపి సీనియర్ నేత ప్రొఫెసర్ మురళీ మనోహర్ జోషి వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలనేదే బిజెపి విధానమని, పొరుగు దేశాల్లో ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినపుడు వాటితో సత్సంబంధాలే తమ ధ్యేయమని పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో మళ్లీ స్థిరత్వం పాందుగొలిపేందుకు కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కృషి చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

గతంలో వాజపేయి ప్రధానిగా ఉన్నపుడు కొనసాగించిన విధానమే తమదని పేర్కొన్నారు. సిబిఐకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని తాము కోరుతున్నామని ఇందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీని కేవలం సిబిఐకే పరిమితం చేయకుండా రాజ్యాంగబద్ధమైన సంస్థలకు కూడా వర్తింపచేయాలని అన్నారు. ప్రధానమంత్రితో పాటు సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి నాయకత్వం వహించే కమిటీ ద్వారా రాజ్యాంగబద్ధమైన సంస్థలకు నియామకాలు జరగాలని అన్నారు. స్వేచ్ఛావాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయాలని కేంద్రప్రభుత్వం చూస్తోందని, అది దేశానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని మురళీమనోహర్ జోషి అన్నారు. కేంద్రప్రభుత్వం ఈ విషయంలో ఏ విధానం అనుసరిస్తోందో ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

స్వేచ్ఛా వాణిజ్యం వల్ల సామాన్యులకే కాదని దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఈ విషయమై తాము వాణిజ్యశాఖ మంత్రితోనూ అధికారులతోనూ మాట్లాడి, ప్రధానికి ఒక లేఖ రాశామని, ప్రస్తుతానికి ఆగినా, భవిష్యత్‌లో ఈ ఒప్పందం జరిగితే మన వాణిజ్య రంగంపై కూడా మనకు అదుపు తప్పుతుందని అన్నారు. యూరోపియన్ దేశాలు మన వాణిజ్యరంగంపై పెద్దరికం చేసే ముప్పు ఉందని వివరించారు. దేశీయ చట్టాలకు కూడా నష్టం జరుగుతుందని అన్నారు. ఇలాంటి ఒప్పందాలను తమ పార్టీ తీవ్రంగా నిరసిస్తుందని అన్నారు. ఇలాంటి ఒప్పందాలపై ప్రజాభిప్రాయం స్వీకరించకుండా సంతకాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో బిజెపి తన అవకాశాలను మెరుగుపరుచుకుంటుందని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles