Political kadiyam srihari comment on errabelli dayakar rao

kadiyam srihari, errabelli dayakar rao, tdp party senior leaders, tdp, bjp, trs party, tdp leaders, 2014 election,

kadiyam srihari comment on errabelli dayakar rao

ఎర్రబెల్లిపై గులాబీ మార్క్ ? లీక్ చేసిన కడియం..?

Posted: 05/15/2013 01:12 PM IST
Political kadiyam srihari comment on errabelli dayakar rao

తెలుగుదేశం నాయకులకు గులాబీ తెగులు పట్టుకుంది. గుబాబీ (చిన్నపువ్వు) కోసం టిడిపి సినీయర్ నాయకులు ఎగబడుతున్నారని మాజీ మంత్రి కడియం శ్రీహరి కొన్ని పేర్లు లీక్ చేశాడు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకోనున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని తెరాసలో చేరనున్న కడియం శ్రీహరి కూడా చెప్పారు. ఎర్రబెల్లి తన దారికే వస్తారని ప్రచారం సాగుతోందని, అదే నిజమైతే ఆయన కోసం తాను అక్కడ ఎదురు చూస్తానని చెప్పారు.

తెలంగాణ విషయమై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన వైఖరి స్పష్టం చేయని పక్షంలో ఆ పార్టీకి తెలంగాణ ప్రాంతంలో నూకలు చెల్లినట్లేనని ఆ ప్రాంత టిడిపి తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారట. వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేస్తే గెలువలేమని చాలామంది తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారట.

ఈ నేపథ్యంలో టిడిపిని వీడి తెరాస, బిజెపి (పెద్ద పువ్వు)లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఎక్కువమంది తెరాస వైపు మొగ్గుచూపుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే తెలంగాణ పేరుతో టిడిపి నుండి పలువురు బయటకు వెళ్లారు. మిగిలిన వారు తెరాసలో చేరారు. నాగం జనార్ధన్ రెడ్డి మాత్రం బిజెపిలో చేరేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఎర్రబెల్లి దయాకర రావు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం సాగుతోంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles