N chandrababu naidu

N Chandrababu Naidu, tdp

N Chandrababu Naidu, tdp

బాబుకు రుణమాఫి సాధ్యమేనా ?

Posted: 05/14/2013 08:45 PM IST
N chandrababu naidu

గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ చేసి కొత్త ఒరవడికి తెరలేపారు. ఇక మొన్న తెలుగు దేశం పార్టీ అధినేత చేపట్టిన పాదయాత్రలో రైతుల రుణమాఫి పైనే తొలి సంతకం చేస్తానని, ఇవే కాకుండా మరిన్ని హామీల మీద హామీలు ఇచ్చారు. వాటి సంగతి ప్రక్కన పెడితే... కర్ణాటక ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ రుణమాఫి హామీ ఇచ్చింది. అయితే నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సిద్ధరామయ్య రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఇదే విషయం పై చర్చ సాగుతుంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే సిద్ధరామయ్య చేసినట్లు రుణమాఫి చేస్తాడా ? ఒకవేళ చేస్తే అన్ని చేస్తాడా ? లేక సహకార రుణాలు చేస్తాడా ? అన్నది ప్రశ్న. సిద్దరామయ్య ప్రభుత్వం 1225 కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ రుణమాఫి నిర్ణయం వలన బలహీన వర్గాలకు చెందిన 10.3 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. అయితే మన రాష్ట్రంలో చంద్రబాబు రైతులందరి రుణాలు అని ప్రకటించడం వల్ల అది అరవైవేల కోట్లకు పైగా అవుతుంది మరి దీనిని చంద్రబాబు అమలు చేస్తాడో లేక అధికారంలోకి రావడానికి ఇలాంటి మాటలు చెప్పాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles