Sc court verdict no single medical entrance exam

NEET PG, NEET Supreme Court, NEET PG results, NEET PG 2013 verdict, NEET supreme court verdict

The Supreme Court allowed the declaration of results for medical entrance examination conducted by private medical colleges.

ఈ ఏడాదికి నీట్ అవసరం లేదు

Posted: 05/13/2013 03:48 PM IST
Sc court verdict no single medical entrance exam

వైద్య విద్యార్థులకు ఊరట లభించింది. జాతీయ మెడికల్ ఎంట్రెస్ టెస్ట్ (నీట్) ద్వారానే వైద్య విద్యార్థులను ఎంపిక చేయాలనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీని పై మన రాష్ట్ర విద్యార్థుల్లో ఆందోళనలు, నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీని పై సుప్రీంకోర్టు నేడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సంవత్సరం మెడికల్ ప్రవేశాలు పాత పద్దతిలోనే అంటే ఎంసెట్ ర్యాకుల ద్వారానే ఎంపికచేయాలని, ఈ సంవత్సరం నీట్ తప్పని సరికాదని పేర్కొంటూ, ఈ వెసలుబాటు ఈ ఏడాదికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. సుప్రీం కోర్టు తాజా తీర్పు నేపధ్యంలో రాష్ట్రంలో ఈ ఏడాదికి ఎంసెట్‌ ఫలితాల ఆధారంగానే మెడిసిన్‌ సీట్లు భర్తీ చేయనున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ వెసలుబాటును కల్పిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు తెలిపింది. ఇక తుది తీర్పును అందరిని పరిగణలోకి తీసుకొని వెల్లడిస్తామని న్యాయస్థానం పేర్కొంది. ఇక వివిధ రాష్ట్రాలు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను వెల్లడించుకోవచ్చని తెలిపింది. ఈ తీర్పుతో ఈ ఏడాది ఎంసెట్ రాసిన విద్యార్థులకు ఊరట చేకూరినట్లే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles