Sharif looks to return to power after pakistan elections

pakistan latest news, pakistan politics latest news, nawaz sharif latest news, nawaz sharif declares as president of pakistan 2013, Imran khan pti party in second position, terrorist attack in pakistan, terrorist attack on elections poling centers, 24 died in pakistan in terrorist attack

Former Pakistan Prime Minister Nawaz Sharif looks set to return to power, according to exit polls. He and his colleagues face the tough challenge of tackling Pakistan economic woes, energy problems and violence

మళ్ళీ ప్రధానిగా నవాజ్ షరీఫ్

Posted: 05/13/2013 10:53 AM IST
Sharif looks to return to power after pakistan elections

పాకిస్థాన్ లో కొన్ని హింసాత్మకమైన సంఘటన మధ్య జరిగిన ఎన్నికలలో అక్కడి పార్టీ అయిన పాకిస్థాన్ ముస్లీం లీగ్ -నవాజ్ (పిఎంఎల్ - ఎన్ ) అత్యధికంగా 126 స్థానాలలో గెలుపొంది అతి పెద్ద పార్టీగా ఏర్పడింది. మూడు పార్టీలు పోటీ చేసిన ఈ ఎన్నికలలో మాజీ పాకిస్థాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన  తెహ్రిక్ ఐ ఇన్సాఫ్ పార్టీ 37 స్థానాలను గెలుచుకొని ప్రతిపక్ష హోదా దక్కించుకోగా, అధికార పిపిపి పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇక పిఎంఎల్-ఎస్ పార్టీ గెలుపొందడంతో పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ ప్రధాని కానున్నారు. గతంలో రెండు పర్యాయాలు 1990-93, 1997-99లలో ప్రధానిగా చేశారు. మళ్లీ ఇప్పుడు మళ్లీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇక నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ ప్రధానిగా గెలవడం భారత్ కి కాస్త అనుకూలమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో ఈయన ప్రధానిగా ఉన్నప్పుడే భారత్ - పాక్ మధ్య శాంతి చర్చలకు చొరవ చూపారు. మళ్ళీ ఇప్పుడు అలాంటి చొరవ చూపేందుకు సిద్ధంగా ఉంటారని అంటున్నారు. ప్రచార సమయంలో యువతకు ఇచ్చిన వాగ్ధానాలను అన్నింటిని నెరవేరుస్తానని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles