London zoo seeks female mate for near extinct fish

mangarahara cichlid fish, urgently seeking a female mate, london zoo, berlin zoo,

London Zoo seeks female mate for near-extinct fish

పెళ్లి కూతురు కోసం అధికారులు పరుగులు?

Posted: 05/11/2013 09:37 AM IST
London zoo seeks female mate for near extinct fish

ఈ రోజుల్లో పెళ్లి కాని అబ్బాయిలు సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.. వధువు కోసం వెతికి వెతికి కాళ్ల చెప్పులు అరిగిపోతున్నాయి . అయిన పెళ్లికానీ ప్రసాదుల సంఖ్య పెరిగిపోవటంతో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. అబ్బాయి కి పెళ్లి చెయ్యాలంటే .. తల్లిదండ్రులకు ఒక విషపరీక్షగా మారిపోయింది. అదే అమ్మాయి కి పెళ్లి అంటే, అబ్బాయిలు క్యూ కడుతున్నారు. ఇదే మనుషులకే ఇలాంటి ఇక చిన్న చిన్న జీవరాశుల సంగతి ఎలా ఉంటుందో చెప్పాండి. అంటే వాటికి ఒక ఆడ తోడు కావాలి కదా? తమ జాతిని అభివ్రుద్ది చెయ్యాటనికి.. అలాంటి కష్టమే ఒక మగ చేపకు వచ్చింది. ఆ మగ చేప ఆడతోడు లేక అల్లాడిపోతుంది.

ఆ మగ చేప బాధ చూసి అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. వధువు కోసం అధికారులు చెరువులు, సముద్రాలు, కుంటలు, కాలువాలు, నదులు, సరస్సులో వెతికి వెతికి అలసిపోయారు. చివరకు వారు ఒక ప్రకటన ఇచ్చారు. ఈ మగ చేప వధువు కావాలెను. అంటే ఎవరైన ఇంట్లే అక్వేరియం లో ఇలాంటి ఆడ చేప ఉంటే మాకు సమాచారం ఇవ్వండి. మీకు తగిన బహుమతి ఇవ్వబడును. మంగారహార సిచ్‌లిడ్.. ఇదేదో లాటిన్ భాషలోతిట్టు కాదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ చేప జాతి పేరు. పూర్తిగా అంతరించిపోయే దశలో ఉన్న జాతికి చెందిన చేపలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడు మాత్రమే ఉన్నాయి.

అందులో రెండు లండన్ జూలో ఉన్నాయి. మూడోది స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ జూలో ఉంది. విషాదమేంటంటే.. మూడూ మగవే. ఇప్పుడా రెండు జూల అధికారులూ వీటి సంతతిని పెంపొందించడానికి అవసరమైన జత చేప కోసం వేట షురూ చేశారు. చేపల సేకర్తలు, ప్రైవేట్ అక్వేరియం యజమానుల దగ్గర ఈ జాతి ఆడ చేప ఉంటే తమకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles