Political railway minister pawan kumar bansal resigns

pawan kumar bansal resign, Pawan Kumar Bansal, Minister Pawan Kumar Bansal, congress party, pm, manmohan singh, sonia gandhi, kavuri sambasiva rao, mp kavuri sambasiva rao,

railway minister pawan kumar bansal resigns

అశ్వనీకుమార్ రాజీనామా!. బన్సల్,

Posted: 05/10/2013 06:58 PM IST
Political railway minister pawan kumar bansal resigns

రేపు జరిగే కాంగ్రెసు కీలక సమావేశంలో అశ్వినీ కుమార్, బన్సాల్‌ల భవిష్యత్తు తేలిపోతుందని విశ్లేషకులు అంటున్నారు. బన్సాల్ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. కోల్ గేట్‌ కేసులో సిబిఐ నివేదికను మార్చారనే ఆరోపణలను అశ్వినీ కుమార్ ఎదుర్కుంటున్నారు. కాగా అశ్వినీ కుమార్‌కు శాఖ మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2014 ఎన్నికలే లక్ష్యంగా కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేయనున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న పవన్‌కుమార్ బన్సల్, అశ్వనీకుమార్‌లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. వీరి రాజీనామాలను ప్రధానమంత్రి ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.

ఈనెల 13న మంత్రివర్గంలో మార్పులు చేయనున్నట్లు సమచారం. మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ చేస్తే బాగుంటుందని, రాష్ట్రంలో అసంతృప్తి నేతలకు ఈసారి అవకాశం కల్పించాలని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆలోచిస్తున్నట్లు తెలియవచ్చింది. కావూరి సాంబశివరావుకు ఈసారి అవకాశం రావచ్చునని, ఆయనకు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి పదవి ఇవ్వవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ క్రమంలో కేంద్ర కేబినెట్‌లో శాఖల మార్పునకు అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జైపాల్‌రెడ్డికి రైల్వేశాఖ, న్యాయశాఖ మంత్రిగా కపిల్ సిబల్, హోం మంత్రిగా గులాం నబీ ఆజాద్‌ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. పవన్‌కుమార్ బన్సల్ అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బన్సాల్ రాజీనామా చేయక తప్పదని అంటున్నారు. లేదంటే ఆయనకు ఉద్వాసన పలికవచ్చునని చెబుతున్నారు. బన్సాల్‌ను సిబిఐ ఏ క్షణంలోనైనా విచారించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గ సమావేశానికి బన్సాల్ హాజరు కాలేదు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles