Political bjp leader kishan reddy fire on congress party

bjp leader kishan reddy, bjp, congress party, telangana issue, karnataka poll results, kodandaram, jac, cm kiran kumar reddy,

bjp leader kishan reddy fire on congress party

కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి చావు మాటలు..

Posted: 05/10/2013 01:54 PM IST
Political bjp leader kishan reddy fire on congress party

కాంగ్రెస్ ప్రభుత్వం కర్నాటక లో విజయం సాధించిన ఆనందంలో ఉన్న సమయంలో బిజేపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి చావు మాటలు వినిపించారు. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, ఇతర ఐకాస నేతలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. చలో అసెంబ్లీ కార్యక్రమంపై వారు చర్చించారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. తెలంగాణపై పోరాటం చివరి దశకు చేరిందన్నారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశంలో తెలంగాణ బిల్లును పెడుతుందో లేదా చస్తుందో కాంగ్రెస్సే తేల్చుకోవాలని కిషన్ రెడ్డి సవాల్ చేశారు. 2014 ఎన్నికలలోపే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను స్తంభింపజేసేలా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి కార్యాచరణను ఈ రోజు మధ్యాహ్నం ప్రకటిస్తామని కోదండరామ్ తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు లక్ష్యంగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తాము నిర్వహిస్తామని చెప్పారు. చలో అసెంబ్లీకి తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, సిపిఐ పార్టీలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయని ఈ సందర్భంగా కోదండరామ్ మీడియాతో చెప్పారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles