పీపుల్స్ రిపబ్లిక్ పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ మనుమరాలే ఇప్పుడు కమ్యూనిస్టు చైనాలోని అత్యంత ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకోవడం చర్చనీయాంశమైంది. మావో మనుమరాలు కాంగ్ డొంగ్మై, ఆమె భర్త చెన్ డాంగ్షెంగ్లతో పాటు మావో మూడో భార్య హీ జిజెన్ల మొత్తం ఉమ్మడి సంపద సుమారు రూ.4,428 కోట్లు ఉన్నట్లు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్టు’ పత్రిక వెల్లడించింది. గౌంగ్డాంగ్ కేంద్ర స్థానంగా వెలువడే ‘న్యూ ఫార్చూన్’ మ్యాగజైన్ ఏటా ప్రకటించే చైనాలోని అత్యంత ధనవంతుల జాబితాలో కాంగ్ డొంగ్మై 242వ స్థానంలో నిలిచారు.
ఆమె భర్త చెన్ చైనాలో తొలి వేలం సంస్థ ‘గార్డియన్’తో పాటు దేశంలో నాలుగో అతిపెద్ద బీమా సంస్థ ‘తైకాంగ్’ వ్యవస్థాపకుడు కావడం విశేషం. 1999లో పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ సాధించిన కాంగ్... బీజింగ్‌లో ఓ సాంస్కృతిక సంస్థతో పాటు అనుబంధంగా బుక్‌హౌస్‌ను నిర్వహిస్తున్నారు. అవి సామ్యవాద సంస్కృతి పరిరక్షణ లక్ష్యంతో పనిచేస్తున్నాయి. అంతేకాదు మావోపై కాంగ్ రచించిన నాలుగు పుస్తకాలు అత్యధికంగా అమ్ముడుపోయాయి. అందుకే కాంగ్ తన తాత మావో పేరునే మూలధనంగా మార్చుకున్నారని సౌత్ చైనా మార్నింగ్ పోస్టు వ్యాఖ్యానించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more