Jagan ysr sc may clarify on jagan mohan reddy bail plea

jagan mohan reddy bail, ys jagan mohan reddy, jagan-ysr, supreme court resumes, ysr congress leader , jagan mohan reddy, sc may clarify on jagan bail plea, cbi court,

sc may clarify on jagan mohan reddy bail plea

వైఎస్ జగన్ బెయిల్‌పై తీర్పు రిజర్వు

Posted: 05/06/2013 03:56 PM IST
Jagan ysr sc may clarify on jagan mohan reddy bail plea

జగన్ బెయిల్ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం  తీర్పును వాయిదా వేసింది.   వేలాది కోట్ల రూపాయల  అక్రమ  లావాదేవీలు  దేశంలోనే కాకుండా మరో 7 దేశాలకు  విస్తరించి వున్నాయని  సీబీఐ పేర్కొంది.  రాజకీయపరమైన  అంశాలకున సీబీఐకు  సంబంధం లేదని  తెలిపింది.  ఏ2గా విజయసాయి రెడ్డి బయట ఉండి సాక్షులను బెదిరిస్తున్నారని, ఏ1గా ఉన్న జగన్  బయటికి వస్తే  ఏం జరుగుతుందో  వూహించవచ్చని సీబీఐ  న్యాయస్థానానికి  తెలిపింది.  హైకోర్టులో ఓ మాట, సుప్రీంకోర్టులో ఓ మాట చెప్పి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని సీబీఐ ఏడాది కాలంగా జైల్లో ఉంచుతోందని ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. కోర్టును సీబీఐ తప్పుదోవ పట్టిస్తోందని తెలిపారు.

జగన్‌ మోహన్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై జరిగిన వాదనల్లో ఆయన తరపున సీనియర్‌ న్యాయవాదులు, హరీష్ సాల్వే, ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఏడు అంశాల్లో జగన్‌ కస్టడీ అవసరమని హైకోర్టులో, కస్టడీ అవసరం లేదని సుప్రీంకోర్టులో సీబీఐ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. దాదాపు ఏడాది కాలంగా జగన్‌ను ఎందుకు జైల్లో పెట్టారో చెప్పాలని సీబీఐని ప్రశ్నించారు. మరోవైపు జగన్ కేసు విచారణకు నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని సీబీఐ వాదించింది. విచారణ కీలక దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో బెయిల్ మంజూరు చేయరాదని న్యాయస్థానాన్ని కోరింది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును నిలుపుదల చేసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles