Portar wife wins one crore in realty show

asianet realty show, portar wife gets one crore, realty show kaun banega crorepati, ideal couple win asianet prize money

portar wife wins one crore in realty show

భారం మోసే భర్తకు కోటీశ్వరి భార్య

Posted: 05/02/2013 03:21 PM IST
Portar wife wins one crore in realty show

 

 

 

కులాంతర వివాహం చేసుకుని భార్యను పోషించటానికి పోర్టర్ గా పనిచేయటమే కాక ఆమెను చదివించి, ఉద్యోగం కోసం రాయవలసిన పోటీ పరీక్షలకు కూడా ప్రోత్సాహమిచ్చిన భర్తకు ఊరట కలిగించిందా భార్య. ఆమె పేరు సనూజ.  ఏసియా నెట్ టివి వారు నిర్వహించిన కోన్ బనేకగా కరోడ్ పతి రియాల్టీ షో లో 15 ప్రశ్నలకు చకచకా సమాధానమిచ్చి కోటిరూపాయల బహుమతిని షోలో ప్రధమంగా అందుకున్న సనూజా రాజన్ ది తిరువనంతపురం. 
డిగ్రీ పూర్తి చేసిన సనూజా కలెక్టర్ ఆఫీసులో సంవత్సరంన్నర క్రితం ఉద్యోగాన్ని సంపాదించింది.  ఇద్దరు పిల్లలు కలగటం, అనారోగ్యాలతో అప్పుల బాధలో ఉన్న వారి సంసారానికి రియాల్టీ షో లో గెలుచుకున్న బహుమతి అండగా నిలిచింది.  టాక్సీ కొనిచ్చి భర్త ను పోర్టర్ పని నుంచి తప్పిస్తానని సనూజ అంటోంది. 
భర్త అనేదానికి అర్థం భారాన్ని మోసేవాడు అని.  పోర్టర్ గా అందరి భారాలు మొయ్యటమే కాకుండా ఆదర్శవంతంగా ప్రేమ వివాహం చేసుకుని సనూజను పట్టుదలతో చదివించి ప్రభుత్వోద్యోగిని చేసిన ఆమె భర్త జీవన శైలి ఆదర్శనీయం
-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles