Sarabjit singh cremation tomorrow

sarabjit singh cremation tomorrow, sarbjit dead in jinna hospital, sarbajit attacked in lahore jail, rahul gandhi, susheel kumar shinde

sarabjit singh cremation tomorrow

సరబ్ జీత్ మరణంతో నిరసనలు

Posted: 05/02/2013 02:36 PM IST
Sarabjit singh cremation tomorrow

సరబ్ జీత్ మరణంతో పంజాబ్ లోని అతని స్వగ్రామం భీకీపిండ్ లో నిరసనలు వెల్లువెత్తాయి.  పాకిస్తాన్ పతాకాన్ని దిష్టిబొమ్మలను తగులబెట్టారు.  వ్యాపారాలు, దుకాణాలు మూసివేసి ఆందోళనగా ర్యాలీలు చేపట్టారు.  సరబ్ జిత్ మృత దేహం కోసం అతని కుటుంబ సభ్యులు ఢిల్లీలో వేచి చూస్తుండగా గ్రామవాసులంతా వారి రాకకోసం ఎదురుచూస్తున్నారు.  ఈరోజు సాయంత్రం వరకు వారు గ్రామానికి చేరుకుంటారని అందరూ భావిస్తున్నారు. 

సరబ్ జీత్ మృతి పట్ల కుటుంబ సభ్యులకు రాహుల్ గాంధీ సంతాపం తెలియజేసారు.  ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీకి ఈ రోజు కూడా పార్లమెంటుని స్థంభింపజేయటానికి మరో కారణం దొరికింది.  ఈ ఘటనను క్రూరమైన హత్యగా భాజపా పేర్కొంది.  పాకిస్తాన్ దుర్మార్గంగా వ్యవహరించిందని, కేంద్ర ప్రభుత్వం మెతక వైఖరి వలనే ఈ ఘటన జరిగిందని భాజపా అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. 

ఈలోపు పాకిస్తాన్ ప్రభుత్వం లాహోర్ జైల్లో ఈ దాడికి పాల్పడినవారి మీద హత్యానేరాన్ని మోపింది.  అప్పటికే వాళ్ళు హత్యానేరంలో జైలు శిక్ష అనుభవిస్తున్నవారే.  వాళ్ళకీ కొత్త నేరారోపణ వలన ఏమీ తేడా రాదు.  కానీ అంతకంటే ఏం చెయ్యగలరు.  పూర్తి విచారణకు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 

సరబ్ జిత్ సింగ్ సోదరి దల్బీర్ సింగ్, అంత్యక్రియలను రేపు నిర్వహిస్తామని తెలియజేసారు.  అవి అధికార లాంఛనాలతో జరుగుతాయని హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles