Rajbhawan is connected to solar power saving 70 percent of consumption

rajbhawan goes solar, solar power saves 70 percent, governor naramihan, solar power unit costed 96 lakhs, jammu kashmir, gujarat

rajbhawan is connected to solar power saving 70 percent of consumption

సౌర విద్యుత్ తో 70 శాతం ఆదా చేసిన రాజ్ భవన్

Posted: 04/19/2013 10:30 AM IST
Rajbhawan is connected to solar power saving 70 percent of consumption

 గవర్నర్ నరసింహన్ ప్రోత్సాహంతో ఈరోజు నుంచి హైద్రాబాద్ రాజ్ భవన్ సూర్యకాంతి నుండి విద్యుత్ ను సమకూర్చుకుంటోంది. . 21 ఎకరాలలో నిర్మించబడ్డ గవర్నర్ నివాసం రాజ్ భవన్ విద్యుత్ అవసరాలలో 70 శాతం వరకు సౌరవిద్యుత్ మీదనే ఆధారపడబోతోంది. దానితో ప్రస్తుతం ఉపయోగిస్తున్న విద్యుత్ కొరత నేపథ్యంలో తనవంతు ఆదాను ఆ విధంగా చేస్తోంది రాజ్ భవన్. రాజ్ భవన్ లో రోజుకి మొత్తం విద్యుత్ వినియోగం 250 యూనిట్లయితే, అందులో 150 యూనిట్ల వరకు సౌరవిద్యుత్ లభించబోతోందని గవర్నర్ ప్రిన్స్ పాల్ సెక్రటరీ ఎన్. రమేష్ కుమార్ తెలియజేసారు.

ఇన్ స్టాల్ చేసిన బ్యాటరీలు, ఇనవర్టర్లను బట్టి 200 యూనిట్ల కెపాసిటీ తో నడిచే ఈ సౌరవిద్యుత్ ఉత్పత్తి యూనిట్ కిగాను మొత్తం 96 లక్షల ఖర్చు అయినా భవిష్యత్తులో ఆదా చేసే విద్యుత్ వలన ఇది లాభసాటి బేరమే అవుతుందని అంచనా.

రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ మినహా మిగతా ప్రదేశమంతా సౌర శక్తితో విద్యుద్దీకరించబడింది. దేశంలో ఈ విధంగా సౌరశక్తిని వినియోగిస్తున్న గవర్నర్ లలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మూడవవారు. జమ్మూ కాశ్మీర్, గుజరాత్ లలో ఇప్పటికే విద్యుత్ ప్రత్యామ్నాయంగా సౌరవిద్యుత్ వినియోగం జరుగుతోంది.

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles