Parvez musharraf arrested in pakistan

parvez musharraf arrested, pakistan ex president musharraf, musharraf bail rejected, musharraf nomination papers rejected

parvez musharraf arrested in pakistan

అజ్ఞాతం నుంచి చెరకు

Posted: 04/19/2013 09:51 AM IST
Parvez musharraf arrested in pakistan

దుబాయ్ లో స్వయంగా విధించుకున్న అజ్ఞాతంలో ఉన్న పాకిస్తాన్ మాజీ నియంత అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ పాకిస్తాన్ లో ఎన్నికల ప్రకటన జరగగానే మాతృభూమి మీద మమకారం పెరిగి తిరిగివచ్చారు. పాకిస్తాన్ లో అడుగుపెట్టిన దగ్గర్నుంచీ ఆయనకు అన్నీ ఎదురు దెబ్బలు, అపశకునాలే వరించాయి. పాకిస్తాన్ కి రావటానికి ముందు నుంచే తాలిబాన్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి బాంబు దాడికి సిద్ధమవమని ఆయనకు హెచ్చరికలు పంపించింది. అయినా విమానాశ్రయంలో ధైర్యంగా దిగిన ముషర్రఫ్ తను చెయ్యదలచుకున్న ప్రసంగాన్ని అక్కడే హడావిడిగా చేసేసి వెళ్ళిపోయారు.

ఎన్నికలకు ఆయన వేసిన నామినేషన్లన్నీ తిరస్కరించబడ్డాయి. పాత రికార్డ్ లో ఉన్న సంతకంతో సరిపోలిస్తే, ఆయన సంతకాలలో తేడా వచ్చిందట.

ఇలా నామినేషన్లను తిరస్కరించారో లేదో పాత కేసులన్నీ ఆయన మెడకు చుట్టుకోవటం మొదలుపెట్టాయి. అందులో ముఖ్యంగా ఆయన హయాంలో ఏకధాటిగా 60 మంది న్యాయమూర్తులను ఏకపక్ష నిర్ణయం తీసుకుని తొలగించేసారు. దానిమీద కోర్టులో హాజరైన ముషర్రఫ్ కి బెయిల్ మంజూరు చెయ్యటానికి న్యాయమూర్తులు అంగీకరించలేదు. అక్కడినుంచి వెంటనే పలాయనం చిత్తగించి ముషర్రఫ్ పారిపోయారు. అయితే ఆయన దేశాన్ని మాత్రం దాటలేక పోయారు.

ఇస్లామాబాద్ నగర శివార్లలోని ఫామ్ హౌజ్ లో తలదాచుకున్న ముషర్రఫ్ ని పాకిస్తాన్ పోలీసులు ఈ రోజు ఉదయం పట్టుకున్నారు.

అలా, అజ్ఞాతంలో ఇన్నాళ్ళూ ఎవరికీ కనపడకుండా ఉన్న పర్వేజ్ ముషర్రఫ్ ఎన్నికల ఆశతో తిరిగి వచ్చి చెరలోకి పోయారు. ఆయన మీద బేనజీర్ భుట్టో హత్యతో సహా ఇంకా ఎన్నో కేసులు ఆయనకోసం ఇన్నాళ్ళుగా ఎదురుచూస్తున్నాయి.

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles