Coal blocks allotment scam

coal blocks allotment, prime minister of india, cbi, appex court, bharatiya janata party, arun jaitley, sushma swaraj

coal blocks allotment scam

బొగ్గు కుంభకోణం ముదిరి పాకాన పడుతోంది.

Posted: 04/14/2013 05:36 PM IST
Coal blocks allotment scam

బొగ్గు కేటాయింపులో జరిగిన అవినీతి మీద ఎపెక్స్ కోర్టు కి సిబిఐ ఇచ్చిన నివేదికను ప్రధాన మంత్రి కార్యాలయ సిబ్బంది, న్యాయశాఖా మంత్రి అశ్వని కుమార్ ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసారని జాతీయ దర్యాప్తు సంస్థ సుప్రీం కోర్టుకి చెప్పనున్నట్లు సిబిఐ కార్యాలయం నుంచి ఈరోజు వార్త వినిపిస్తోంది. 

సిబిఐ తన నివేదికను ఎపెక్స్ కోర్టు కి సమర్పించే ముందు సిబిఐ డైరెక్టర్ రంజితో సహా కొందరు సిబిఐ అధికారులను అశ్వనీ కుమార్ పిలిపించుకున్నారని, అప్పుడ జరిగిన సమావేశంలో ఆ నివేదకలో కొన్ని మార్పులు, చేర్పులు చేయించారని ఒక వార్తా పత్రిక ప్రచురించిన కథనం మీద, యుపిఏ ప్రభుత్వం అవినీతికి తోడ్పడుతోందని, ప్రధాన మంత్రి తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నాలను చేస్తోందని, అందువలన ఈ విషయం మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్ఐటి)తో దర్యాప్తు చేయించాలని భారతీయ జనతా పార్టీ ఆందోళన చేసింది. 

దానికి సమాధానం చెప్తూ, యుపి ఏ ప్రభుత్వం సిబిఐ మీద ఎటువంటి వత్తిడీ తేలేదని, సిబిఐ స్వతంత్రంగా వ్యవహరించే దర్యాప్తు సంస్థనీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.  దానిమీద స్పందించిన భాజపా నేత సుష్మా స్వరాజ్ ఇది చాలా గంభీరమైన విషయమని అన్నారు.  మరో నేత అరుణ్ జైట్లీ, సిబిఐని ప్రభుత్వం నిజాయితీగా పనిచేసుకోనివ్వదని, ప్రభుత్వం కలుగజేసుకోవటం ఉంటుందని అన్నారు.  సిబిఐ మీద ఉన్న నమ్మకం పోయిందని, దర్యాప్తులో మూలాల్లోకి పోయి సత్యాన్ని వెలికితీయటానికి ప్రభుత్వం అడ్డుపడుతుందని, అందువలన ఎస్ఐటి చేత దర్యాప్తు చేయించవలసిన అవసరం ఉందని కూడా అరుణ్ జైట్లీ అన్నారు.  ప్రభుత్వం తన అపరాధాలను పల్చగా చేసే ప్రయత్నం చేస్తోందని, అందువలన నివేదికలో పేర్కొన్న వ్యక్తులు తమ ప్రకటనలను బహిరంగంగా ఇవ్వవలసి వుందని కూడా అరుణ్ జైట్లీ అన్నారు. 

ప్రభుత్వ ఆడిటర్లు గత సంవత్సర నివేదికలో, బొగ్గు బ్లాక్ ల కేటాయింపులో పారదర్శకత కొరవైందని, దాని వలన ప్రభుత్వ ఖజానాకి 1.85 లక్షల కోట్ల రూపాయల నష్టం ఏర్పడిందని తెలియజేసింది.  ఆ నివేదికలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మీద ఆరోపణలేమీ చెయ్యలేదు కానీ, బొగ్గు బ్లాకుల కేటాయింపు సమయంలో ఆ మంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి ఆధ్వర్యంలోనే పనిచేస్తోంది. 

అంతే కాకుండా, ఎపెక్స్ కోర్టు విచారణ మొదలవుతూనే సిబిఐ డిఐజిని మరో శాఖకు బదిలీ చేసారు.         

వీటన్నిటి ఆధారంగా భాజపా యుపిఏ ప్రభుత్వాన్ని ఎండగడుతోంది.  ఈ సమయంలో సిబిఐ కూడా తమను ప్రభుత్వం ప్రభావితం చేసిందని, ఒత్తిడికి గురిచేసిందని ఎపెక్స్ కోర్టు కి చెప్తే మాత్రం యుపిఏ ఇంకా సంకట స్థితిలో పడిపోవం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles