32 policemen suspended in maharashtra nehrunagar ps

maharashtra, kurla suburban, nehrunagar, r r patel, home minister of maharashtra, policemen suspended

32 policemen suspended in maharashtra nehrunagar ps

ఒక్కసారే 32 పోలీసుల సస్పెన్షన్

Posted: 04/11/2013 04:08 PM IST
32 policemen suspended in maharashtra nehrunagar ps

మహారాష్ట్రలోని థానే లో భవనం కూలిపోవటంతో ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి.  అందులో ముఖ్యంగా పోలీసులు నిర్మాణ స్థలాలలోకి వెళ్ళి మామూళ్ళు తీసుకోవటం వలన బిల్డర్లు దాన్ని ఆసరాగా తీసుకుని తమ తప్పులకు పోలీసుల మద్దతు లభిస్తుందనే ధీమాలో తమ పనులు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.  దీని ప్రభావం రాష్ట్రమంతటా పడింది. 

కుర్లా సబర్బన్ లోని నెహ్రూనగర్ పోలీస్ స్టేషన్ కి చెందిన 32 మంది పోలీస్ సిబ్బందిని మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ఆర్ పటేల్ సస్పెండ్ చేసారు.  ఇందులో ఎక్కువమంది కాన్ స్టేబుల్స్ ఉన్నారు  కానీ సబ్ ఇన్ స్పెక్టర్ ఆ పై హోదాగల పోలీస్ అధికారులు కూడా కొందరున్నారు. 

కాసిమ్ షేక్ 20 రోజుల పాటు తీసిన వీడియో రికార్డింగ్ లతో పోలీసు బలగాలు తీసుకునే లంచాల గురించి పక్కా సాక్ష్యాధారాలు దొరికాయి.  మహ్మద్ ఖాన్ అనే వ్యక్తి తన ఇంటికి మరమ్మతులు చేయిస్తుండగా రోజూ పోలీసులు వచ్చి వేధిస్తున్నారంటూ అతను ఏసిబి కి ఫిర్యాదు చెయ్యగా వాళ్ళ సూచనలమేరకు ఇంటి దగ్గర సిసి కేమెరాలను బిగించి పోలీసుల లీలలను వీడియోలో బంధించారు.  దానితో అడ్డంగా దొరికిపోయిన ఆ పోలీసులు సస్పెన్షన్ వేటుకి గురయ్యారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles