Vijag boy of 13 made amazing app

vizag, computer app, windows platform, html 5, microsoft india, hacking free app, app to keep secrecy

vijag boy of 13 made amazing app

వైజాగ్ బాలుడి ప్రతిభ

Posted: 04/10/2013 04:49 PM IST
Vijag boy of 13 made amazing app

విశాఖపట్నానికి చెందిన 13 సంవత్సరాల బాలుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళని ఆశ్చర్యపరచే విధంగా కంప్యూటర్ అప్లికేషన్ తయారు చేసాడు. 

బండి జయకృష్ణ అనే నారాయణ ఐఐటి అకాడమీ లో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థి టెక్స్ ట్ జిప్ అని పేరు పెట్టి తాను రూపొందించిన కంప్యూటర్ అప్లికేషన్ ని మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు బృందానికి చూపించి వాళ్ళని ఆశ్చర్యపరచాడు.  విండోస్ ప్లాట్ ఫామ్ మీద హెచ్ టి ఎమ్ ఎల్ 5 లో రాసిన ఈ అప్లికేషన్ వలన ఇద్దరు కంప్యూటర్ యూజర్ల మధ్య ఇచ్చి పుచ్చుకున్న డేటా సురక్షితంగా ఉంటుంది.  మూడోకంటివాడికి తెలియదు.  హ్యాకర్ల చేతికి అస్సలు చిక్కదు. 

ఆ అప్లికేషన్ ని తయారు చెయ్యటమే కాకుండా అది వ్యాపార సంస్థల లావాదేవీల రహస్యాలను ఎవరూ ఛేదించకుండా కాపాడుతుందని వివరించాడు కూడా.  దీన్ని ఒక నెల వరకు నెట్ లో ఉంచుతానని, ఎవరైనా ఉచితంగా దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చని కూడా జయకృష్ణ తెలియజేసాడు. 

డిపిఇ మైక్రోసాఫ్ట్ ఇండియా జనరల్ మేనేజర్ జోసెఫ్ లాండెస్ జయకృష్ణ ను కొనియాడుతూ, అంత చిన్న వయసులో సాఫ్ట్ వేర్ వాడటమే చాలా గొప్ప, అలాంటిది సాఫ్ట్ వేర్ ని రూపొందించటం శ్లాఘనీయమని అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles