Gold chain snatchers in padmavati express

padmavati express, secunderabad, tirupati, summer rush, special trains, armed reserve police, railway police

gold chain snatchers in padmavati express

పద్మావతి ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగలు

Posted: 04/10/2013 03:30 PM IST
Gold chain snatchers in padmavati express

వేసవి రద్దీ ఇంకా మొదలవలేదు అప్పుడే దొంగలు చేతివాటం చూపిస్తున్నారు.  సికింద్రాబాద్-తిరుపతి పద్మావతీ ఎక్స్ ప్రెస్ లో తెల్లవారు ఝామున ప్రయాణీకులు నిద్రలో ఉండగా రైలు పేళ్ళూరు సమీపిస్తున్న సమయంలో రైలు గొలుసు లాగి, రైలు ఆగగానే నాలుగు కంపార్ట్ మెంట్లలో నలుగురు దోపిడీ దొంగల ముఠా విడివిడిగా బంగారు గొలుసులను ప్రయాణీకుల మెడల్లోంచి లాక్కుని ఉడాయించి చీకట్లో కలిసిపోయారు. 

దొంగలు ఎస్-2, ఎస్-5, ఎస్-9, ఎస్-12 లలోంచి దొరికిన గొలుసులు లాక్కుని జరిగిందేమిటో తెలిసే లోపులోనే అక్కడి నుండి అదృశ్యమైనారు. 

ఈ సంఘటనతో అప్రమత్తమైన రైల్వే పోలీసు బలగాలు, దుండగులను పట్టుకోవటానికి పథకం వేస్తున్నారు.  దానిలో భాగంగా ఆర్మ్ డ్ రిజర్వ్ పోలీస్ పెట్రోలింగ్ ని ముమ్మరం చేస్తూ పాత నేరస్తుల కదలికలను కనిపెట్టే పనిలో పడ్డారు.  వేసవి మూలంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రత్యేక రైళ్ళతో పెంచుతున్న రైలు సేవల దృష్ట్యా పోలీసు బలగాలు కూడా పెరిగి పథకం ప్రకారం దుండగుల ఆటకట్టించటానికి సిద్ధపడుతున్నారు.  

దొంగలు తెలివైనవాళ్ళే కాకుండా చోరవృత్తిలో ఆరితేరినవాళ్ళలాగానే ఉన్నారు.  నియమిత స్థలంలో ఎవరో ఒకరు చైన్ లాగారు.  అంతకు ముందు నుంచే నిఘా పెట్టివుంచిన ఆడవాళ్ళ మెడలోని బంగారు గొలుసుని ఒక్కసారిగా లాగి ఎవరికి వారు వెంటనే రైలు దిగి వెళ్ళిపోయారు.  మంచి నిద్రలో ఉండటం వలన నష్టపోయినవాళ్ళకి కూడా పూర్తిగా విషయం అర్థం కాకముందే దొరికినదానితో తృప్తిపడి వెళ్ళిపోయారు కానీ అత్యాశకు పోలేదు. 

మరో విషయమేమిటంటే అందరూ ఒకే భోగీలో కాదు సరికదా పక్కపక్క భోగీల్లో కూడా ఎక్కలేదు.  ఎస్ 2, 5, 9, 12 నంబర్ భోగీల్లో ఎక్కారు.  ఒకవేళ ఒకళ్ళు పట్టుబడ్డా మిగతా వాళ్ళు పారిపోయి, ఆ తర్వాత అందరూ దొంగసొమ్ముని పంచుకోవచ్చన్నది వాళ్ళ ప్రణాళికయ్యుండాలి.  ఒక భోగీలోంచి అరుపులు వచ్చినా మిగతా వాళ్ళు క్షేమంగా తప్పించుకోవచ్చు.  వాళ్ళు దిగిన ప్రాంతం కూడా వాళ్ళకి బాగా తెలిసిన ప్రాంతమైవుండాలి.  ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే దొంగలను పట్టుకోవటం కష్టమేమీ కాదు.  కాకపోతే నష్టపోయినవారికి తిరిగి ఎంత చేతికి వస్తుందా అన్నదే ప్రశ్న. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles