Police constable beaten up by villagers

andhra police, police constable, hyderabad, rangareddy district, sub inspector sridhar reddy, constable rape attempt

police constable beaten up by villagers

పోలీసుకు దేహశుద్ధి

Posted: 04/10/2013 09:04 AM IST
Police constable beaten up by villagers

పోలీస్ యూనిఫాం వేసుకున్నంత మాత్రాన చట్టం వాళ్ళని సమర్ధించదని ఎన్నో సందర్భాల్లో నిరూపితమైనా చాలా విషయాల్లో ముఖ్యంగా చిల్లర వ్యవహారాల్లో నిరూపణలుండవు.  కానీ మహిళ ఆత్మగౌరవానికి చెందిన ప్రశ్న ఉదయించినప్పుడు ఆ మహిళ కానీ, చుట్టుపక్కలవాళ్ళు కానీ ఉపేక్షించరని కూడా నిరూపితమైంది. 

రంగారెడ్డి జిల్లా దోమ పోలీస్ స్టేషన్లో కాన్ స్టేబుల్ గా పనిచేస్తున్న శంకరయ్య దోమ మండలం రాంకోడు గ్రామంలోని వివాహితమీద కన్నువేసాడు.  ఆమెను ఫోన్ లో వేధించటం మొదలుపెట్టాడు.  ఇంకా దుస్సాహం చేసి ఆమె ఇంటికి వెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. 

దానితో ఆమె కేకలు వేసి సహాయాన్ని అర్థించటంతో పరిసరాల్లోని స్థానికులు వచ్చి ఆమె రక్షించటమే కాకుండా కాన్ స్టేబుల్ కి చేసిన దేహశుద్ధికి అతను స్పృహతప్పాడు.  ఆ తర్వాత గ్రామవాసులు సబ్ ఇన్ స్పెక్టర్ శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేసారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles