Yashwantpur express derailed at arakkonam tamilnadu

yashwantpur express, tamilnadu, arakkonam, rayaveluru, derailed yashwantpur express, bangalore chennai train

yashwantpur express derailed at arakkonam tamilnadu

పట్టాలు తప్పిన యశ్వంత్ పుర్ ఎక్స్ ప్రెస్

Posted: 04/10/2013 08:35 AM IST
Yashwantpur express derailed at arakkonam tamilnadu

ఈరోజు తెల్లవారు ఝామున బెంగళూర్ చెన్నై యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ తమిళనాడులో రాయవేలూరు జిల్లా అరక్కోణం దగ్గర సిట్టేరి ప్రాంతంలో పట్టాలు తప్పింది.  మొత్తం పదకొండు భోగీలు పట్టాలు తప్పటంతో భోగీలు చెల్లాచెదరై కనిపిస్తున్నాయి.  ఇంతవరకు అందిన సమాచారాన్నిబట్టి ముగ్గురు మృతిచెందారు. 

సహాయక చర్యలు జరుగుతున్నాయి.  రైల్వై సిబ్బంది పోలీసు బలగాలు ఘటనా స్థలిని చేరుకుని సహాయాన్ని అందిస్తున్నారు.  కిటికీల లోంచి, డోర్ లను బలవంతంగా తెరుస్తూ, ఎసి భోగీల అద్దాల పగలగొడ్తూ సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం కానివ్వకుండా, గాయపడినవారిని హాస్పిటల్ కి చేర్చటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

దెబ్బతిన్న భోగీల పరిస్థితి చూస్తుంటే నష్టం చాలా ఎక్కువగా ఉండేటట్టుగా కనిపిస్తోంది.  ఇంకా గాయపడినవారి సంఖ్య తెలియలేదు కానీ పలువురు గాయపడ్డట్టుగా కనిపిస్తోంది.  రైల్వే సిబ్బంది సహాయక చర్యలతో పాటు రికార్డ్స్ ని బట్టి కూడా ఎందులో ఎంతమంది ఉన్నారో అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు.  వంగిపోయి, చతికిపోయి ఆకారాలు మారిపోయిన ఇనుప డబ్బాలలోంచి వాటిని పగలగొట్టి మనుషులను బయటకు తీసే సమయంలో లోపల ఉన్నవారికి హాని జరగకుండా చూడటం చాలా అవసరం కాబట్టి సహాయక బృందాలు ఆ ప్రయత్నంలో ఉన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles