3g telephone service

dept of telephones, 3 g services, airtel, idea, vodaphone

3g-telephone service

3జి సర్వీసులు

Posted: 04/06/2013 06:06 PM IST
3g telephone service

ఇక నుంచి 3 జి టెలిఫోన్ ఆపరేటర్లు ఏ ఆపరేటర్ కి ఇచ్చిన పరిధిలో వాళ్ళే సేవలందిస్తారు.  వారికి కేటాయించని ప్రదేశాల్లో అక్కడ ఉన్న సర్వీస్ ప్రొవైడర్లతో ఒప్పందానికి వచ్చి 3జి సేవలను అందించటాన్ని నేరంగా పరిగణించి తీవ్రమైన దండనలు విధిస్తామని లైసెన్స్ లు రద్దుచేస్తామని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలిఫోన్స్ ప్రకటించింది. 

మచ్చుకి వోడా ఫోన్ మీద 550 కోట్ల రూపాయలు, ఐడియా సెల్యూలార్ మీద 300 కోట్ల రూపాయల జుర్మానా విధించిన టెలిఫోన్ శాఖ, ఎయిర్ టెల్ ని 3జి సేవలను నిలిపివేయమని ఆదేశాలిచ్చింది.  ఎవరికిచ్చిన 3జి లైసెన్స్ లు వాళ్ళవే కానీ మరొకరితో ఒప్పందానికి రావటాన్ని టెలిఫోన్ శాఖ తప్పుపట్టింది. 

భారతి ఎయిర్ టెల్ వాళ్ళు వాళ్ళకిచ్చిన లైసెన్స్ పరిధిలోనే ఇతర సర్వీస్ ప్రొవైడర్లతో ఒప్పందానికి వచ్చి సేవలను విస్తృతం చేసుకోవటాన్ని నేరంగా పరిగణించిన టెలిఫోన్ శాఖ ఫిర్యాదుని అంతకు ముందు సింగల్ జడ్జ్ కొట్టివేస్తూ ఎయిర్ టెల్ ని అనుమతించినా, నిన్న ఢిల్లీ హైకోర్టు ఆ తీర్పుని రద్దు చేసింది.  దానితో టెలిఫోన్ శాఖ వెంటనే ప్రైవేట్ టెలిఫోన్ ఆపరేటర్లకు నోటీసులిచ్చింది.  తన పరిధిలో ఇతరులతో ఒప్పందం చేసుకున్న ఎయిర్ టెల్ ని దాన్ని నిలిపివేయమని, తమ పరిధులు దాటి ఇతర క్షేత్రాలలో కూడా ఒప్పందం చేసుకున్న ఐడియా, వోడా ఫోన్లకు జుర్మానా విధించింది. 

మీరు 3జి సర్వీసులు వాడుతుంటే ఇక ముందు రోమింగ్ ఉండదు కాబట్టి అవి ఏయే ప్రాంతాల్లో పనిచేస్తాయో చూసి తీసుకోవటం మంచిది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles