Death toll reached 67 in thane incident

thane building collapse, 67 dead in building collapse, prithviraj chauhan, chief minister of maharashtra

death toll reached 67 in thane incident

థానేలో జరిగిన ప్రమాదంలో మృతులు సంఖ్య 67 కి చేరింది

Posted: 04/06/2013 05:59 PM IST
Death toll reached 67 in thane incident

థానేలో జరిగిన ప్రమాదంలో మృతులు సంఖ్య 67 కి చేరింది.  గాయపడిన 62 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.  ఇంకా ఎవరైనా శిథిలాల కింది చిక్కుకుని ఉన్నారేమోనని సహాయక బృందాలు వెతుకుతున్నాయి.

అందులో ఒక్కొక్కరిదీ ఒక్కో చరిత్ర, ఒక్కో వ్యథ ఉంటుంది.  అందులో శిథిలాలలోంచి బయట పడి ప్రాణాలు దక్కించుకున్న 37 సంవత్సరాల ఇమ్రాన్ సిద్దిక్వి బ్రతుకు తెరువు కోసం ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చారు.  ఆయనతో పాటు నివసిస్తున్న 13 మంది కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నారు.  అందులో చిన్నపిల్లలు, కడుపుతో ఉన్న అతని భార్య షకీలా కూడా ఉన్నారు.  తల్లి,దండ్రీ, భార్యా పిల్లలను పోగొట్టుకుని నేను ఎందుకోసం బ్రతుకుతున్నానంటూ సిద్దిక్వి రోదిస్తున్నారు.  అదాటున జరిగిన ఈ సంఘటననుంచి ఇంకా కోలుకోలేకుండా ఉన్న సిద్దిక్వి తన కుటుంబ సభ్యుల పేర్లు చెప్పటానికి కూడా తటపటాయిస్తూ వెతుక్కునేంతగా షాక్ కి గురయ్యారు.

ఈ ఘటన మీద విచారణకు ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్, హాస్పిటల్ లో ఉన్న బాధితులను పరామర్శించారు.  వారికి వీలయినంత సాయం చేస్తానని మాటిచ్చారు.   చౌకబారు నిర్మాణ సామగ్రిని వాడి నెలన్నరలో చకచకా భవనాన్ని నిలబెట్టారు బిల్డర్లు.  భవన నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, అవసరమైన అనుమతులు తీసుకోలేదు కానీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే తమ రక్షణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు మాత్రం వెంటనే తీసుకున్నారు.  బిల్డర్లు పరారీలో ఉన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles