President cleared all pending mercy petitions from 1981 till date

president of india, indian constitution, article 72 of indian constitution, mercy appeals, pending mercy petitions from 1981

president cleared all pending mercy petitions from 1981 till date

mercy-petitions.png

Posted: 04/04/2013 02:37 PM IST
President cleared all pending mercy petitions from 1981 till date

pranab-mukherjee-photo

ఉరిశిక్ష నుంచి క్షమాభిక్షను కోరిన ఏడుగరు నేరస్తులలో ఈరోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఐదుగురి అభ్యర్థనను త్రోసిపుచ్చుతూ, ఇద్దరి ఉరిశిక్షలను జీవిత ఖైదుకి తగ్గించారు. ఎంతో కాలంగా రాష్ట్రపతి కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న క్షమాభిక్ష అభ్యర్థనలన్నిటినీ ఒక్కొక్కటిగా బయటకు తీసి అన్నిటికీ అంతిమ తీర్పు చెప్తూ ఈ ఏడుగురితో పెండింగ్ అనేది లేకుండా చేసారు. ఈ సమయంలో రాష్ట్రపతి కార్యాలయంలో ఒక్క పెండింగ్ క్షమాభిక్ష అభ్యర్థన కూడా లేదు.

చాలా కేసుల్లో లోగడ క్షమాభిక్షను కోరుకున్న నేరస్తులు ఏం జరుగుతుందో, చివరకు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియక సందిగ్ధావస్తలో కొట్టుమిట్టాడుతుండేవారు. ఏదో ఒకటి తేల్చేస్తే బాగుండునని ఆవేదన చెందుతూ సంవత్సరాల తరబడి కాలాన్ని వెళ్ళబుచ్చినవారున్నారు. భారత రాజ్యాంగం ఆర్టికిల్ 72 రాష్ట్రపతికి క్షమాభిక్షలకు, శిక్షలను తగ్గించటానికి ఇచ్చిన అధికారాలను వాడుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కార్యాలయంలో ఏ అభ్యర్థనా పెండింగ్ లో లేకుండా చూసారు.

1981 నుంచి ఈ రోజు వరకు రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం వచ్చిన 112 అర్జీలలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 81 నేరస్తుల అర్జీలను తిరస్కరించారు, మిగిలిన 31 నిందితుల ఉరిశిక్షలను జీవిత ఖైదులోకి మార్చారు.

క్షమాభిక్షను తిరస్కరించిన నేరస్తులుః

  1. 1986లో ఉత్తరప్రదేశ్ కి చెందిన గుర్మీత్ సింగ్ ఒక కుటుంబానికి చెందిన 13 మందిని హత్య చేసాడు.
  2. 1993 లో హర్యానాకు చెందిన ధరమ్ పాల్ అత్యాచారం చేసి, ఆమె కుటుంబ సభ్యులను ఐదుగురిని హత్యచేసాడు.
  3. 2001 లో హర్యానాకు చెందిన సోనియా, ఆమె భర్త సంజీవ్ కలిసి ఆమె కుటుంబ సభ్యులు ఎనిమిది మందిని హత్యచేసారు.
  4. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన సురేష్, రామ్జీలు వాళ్ళ సోదరుడి కుటుంబంలో ఐదుగురిని హత్య చేసారు.

ఇతర నేరస్తులుః

  1. 2002 లో ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన జాఫర్ అలీ భార్య, తన ఐదుగురు కూతుళ్ళను చంపాడు.
  2. ఉత్తర్ ఖండ్ కి చెందిన సుందర్ సింగ్ అత్యాచారం చేసి హత్య చేసిన నేరం మీద 1989 లో అరెస్టయ్యాడు.
  3. కర్నాటకకు చెందిన ప్రవీణ్ కుమార్ 1994 లో ఒక కుటుంబంలోని నలుగురు సభ్యులను హత్య చేసాడు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp and left parties getting ready for bundh on 9th
T leaders arrested in sadak bund attented court today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles