T leaders arrested in sadak bund attented court today

telangana agitation, sadak bundh, alampur court, kodandaram, srinivas goud, eetela rajender

t leaders arrested in sadak bund attented court today

sadak-bundh.png

Posted: 04/04/2013 02:27 PM IST
T leaders arrested in sadak bund attented court today

kodandaram

ఆలంపూర్ కోర్టులో హాజరైన తెలంగాణా ఉద్యమకారులు

రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సడక్ బంద్ కార్యక్రమం నిర్వహించి అందులో ఆందోళనలతో రహదారిమీద రాకపోకలకు అంతరాయం కలిగించిన నేరం మీద అరెస్టైన తెలంగాణా నాయకులు, బెయిల్ మీద బయటకు వచ్చిన వారు ఈ రోజు ఆలంపూర్ కోర్టుకి హాజరయ్యారు. వాళ్ళల్లో తెలంగాణా ఐక్య కారాచరణ సమితి, తెలంగాణా రాష్ట్ర సమితి, ఉద్యోగ సంఘ నాయకులున్నారు.

తెలంగాణ ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కి, ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కి కోర్టుకి హాజరవాలనే షరతుతో బెయిల్ మంజూరవటంతో ఈ రోజు ఆలంపుర్ కోర్టుకి హాజరయ్యారు. తెరాస నేతల ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, జితేందర్ రెడ్డి ల రిమాండ్ గడువు పూర్తయింది. దానితో వారు కూడా కోర్టుకి హాజరయ్యారు.

అయితే ఈ కేసుల మీద ఛార్జ్ షీట్ దాఖలు అవని కారణంగా వారంతా మరోసారి కోర్టులో హాజరవాల్సివుంటుందని కోర్టు పేర్కొంది.

బయటకు వచ్చిన తర్వాత ప్రొ.కోదండరామ్ మాట్లాడుతూ, ఇదో గుడ్డి ప్రభుత్వమని, శాంతియుతంగా ఉద్యమం చేసుకుంటున్నవారిని కోర్టుల చుట్టూ తిప్పుతోందని విమర్శించారు. ఇలాంటి కేసులు, అరెస్ట్ లు, కోర్టులు జైళ్ళ చుట్టూ తిప్పటాలు ఉద్యమాన్ని నీరుకార్చలేవని చెప్తూ, మరో సడక్ బంద్ కి వ్యూహరచన చేస్తున్నట్టుగా ప్రకటించారు.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  President cleared all pending mercy petitions from 1981 till date
Electricity problem to be discussed by govt today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles