10 maoists killed by other group

maoists, cpi, jarkhand, maoists killed, triteeya prastuti committee, jarkhand police

10 maoists killed by other group

maoists-killed.png

Posted: 03/28/2013 03:24 PM IST
10 maoists killed by other group

జార్ఖండ్ లో ఎన్ కౌంటర్ లో నిన్న రాత్రి 10 మంది మావోయిస్ట్ లు మరణించారు. ఈ విషయాన్ని పోలీసులు ఈరోజు ధృవీకరించారు.

ఇది పోలీసు ఎన్ కౌంటర్ కాదు. ఎన్ కౌంటర్ అనే దానికి వ్యావహారికంగా పోలీసులు చంపటం అనే అర్థం వచ్చేసింది. ఎన్ కౌంటర్ అంటే తెలుగులో ఎదురు దాడి. ఎవరైనా దాడి చేస్తున్నప్పుడు ఎదురు చెయ్యటమే ఎన్ కౌంటర్. ఎన్ కౌంటర్ చేస్తానని అనటం, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అని చెప్పటం లాంటి సినిమా సంభాషణల వాడకం వలన ఆ అర్థం స్పృశిస్తోంది.

జార్ఖండ్ లో జరిగిన దాడి, ఎదురు దాడి రెండూ మావోయిస్ట్ లవే. చాత్రా జిల్లాలోని లాక్రా మండా గ్రామ సమీపంలో ఈ దాడులు మావోయిస్ట్ ల రెండు దళాల మధ్య జరిగాయి. ఛాత్రా జిల్లాలో కుందా పోలీస్ స్టేషన్ పరిధి లోకి వచ్చే లాక్రామండా గ్రామం రాంచీ నుంచి 100 కిలీ మీటర్ల దూరంలో ఉంది. తృతీయ ప్రస్తుతి కమిటీ (టిపిసి) దళం చేసిన కాల్పుల వలన ఆ పది మంది మావోయిస్ట్ లు చనిపోయారని పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ తెలియజేసారు.

ఈ వార్త వినగానే పోలీస్ సూపరింటెండెంట్ బర్తెరే హుటా హుటిని ఘటనా స్థలికి చేరుకున్నారు.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Markandey katju keen on appealing for sanjay dutt
All party meet on babli issue is over  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles