Italy agrees to return mariners to face indian court case

supreme court of india, italy govt, italian mariners, fishermen killed in kerala waters

italy agrees to return mariners to face indian court case

italian-mariners.png

Posted: 03/22/2013 08:36 AM IST
Italy agrees to return mariners to face indian court case

mariners-return-agreedకేరళ సముద్రజలాలలో మత్సకారులను కాల్టి చంపిన నేరానికి భారత దేశ న్యాయస్థానంలో విచారణను ఎదుర్కుంటున్న ఇద్దరు ఇటలీ దేశ నావికా అధికారులను భారత్ కి అప్పగించటానికి ఇటలీ అంగీకరించింది.  

ఓటు హక్కుని వినియోగించుకోవటం కోసం స్వదేశం వెళ్ళటానికి అనుమతి కోరిన ఇటలీ నావికాదళ నిందితులను ఈ రోజు అనగా మార్చి 22 వరకు తిరిగి పంపించవలసి ఉంటుందనే షరతు మీద అంగీకరించి పంపిన భారత్ కి ఇచ్చిన మాటలను గౌరవించకుండా, వాళ్ళ విచారణ అంతర్జాతీయ న్యాయస్థానంలో జరగాలని, భారత అత్యున్నత న్యాయస్థానం నోటీసులను మేము లెక్కచెయ్యమని చెప్పిన ఇటలీ ప్రభుత్వం చివరకు తమ మాటలను వెనక్కి తీసుకుంటూ భారత దేశంలో కేసు విచారణను ఎదుర్కోవటానికి పంపించటానికి ఒప్పుకుంది.  

సెల్వాటొరే గిరోనే, మాస్మిలానో లాట్టోర్ అనే ఇద్దరు ఇటలీ సరుకుల నావలో పనిచేసే నావికా అధికారులు, కేరళకు చెందిన ఇద్దరు మత్స్యకారులను సముద్ర దొంగలనే అనుమానంతో తమ సరుకులను రక్షించుకునేందుకు కాల్పులు జరిపామని అన్నారు.  ఆ నేరం మీద విచారణ జరుగుతుండగా, ఒక సారి క్రిస్ట్ మస్ కని స్వదేశం వెళ్ళివచ్చి మరోసారి ఓటు హక్కుని వినియోగించుకోవటమని వెళ్ళినవారు తిరిగి రాకపోవటం, వాళ్ళని పంపించమని ఇటలీ ప్రభుత్వం చెప్పటాన్ని భారత దేశ అత్యున్నత న్యాయస్తానం తప్పుపట్టింది.  కఠిన మైన నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళిద్దరినీ పంపించేంత వరకూ ఆ దేశంతో సంబంధాలు తెగతెంపులు చేసుకోమని, ఆ దేశ రాయబారిని భారత్ వదిలి వెళ్ళనీయవద్దని ఆఙలు జారీచేసింది.  దానితో దిగివచ్చిన ఇటలీ ప్రభుత్వం నిందితులిద్దరినీ తిరిగి పంపించటానికి అంగీకరిస్తున్నామంటూ తెలియజేసింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana leader reach assembly on foot
Us proposal against srilanka passed in human rights commistion  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles