Both houses at center adjourned amidst uproar

parliament of india, bjp party, defence minister shinde, sushma swaraj, dmk party, aidmk party

both houses at center adjourned amidst uproar

both-houses-adl-for-today.png

Posted: 03/14/2013 02:51 PM IST
Both houses at center adjourned amidst uproar

parliament

కేంద్రంలో ఉభయసభలూ రేపటికి వాయిదాపడ్డాయి.  డిఎమ్ కే, ఏఐడిఎమ్ కే రెండు పార్టీ సభ్యులూ పార్లమెంటులో సభాపతి దగ్గరకు వెళ్ళి ఆందోళన చేసారు. రాజ్యసభలో ఏఐడిఎమ్ కే సభ్యులు కూడా పట్టుబట్టటంతో రెండు సభలూ రేపటి వరకు వాయిదా పడ్డాయి.  

పార్లమెంటు సభాపతి మీరా కుమార్, జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడికి మరణించిన జవాన్లకు సంతాపాన్ని వెలిబుచ్చటంతోనే ఎఐడిఎమ్ కే, డిఎమ్ కే సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు.  శ్రీలంక నావికాదళం అరెస్ట్ చేసిన తమిళ నాడు మత్స్యకారుల విషయంలోనూ, ఉగ్రవాదులనుంచి రక్షణ లేదన్న విషయంలోనూ ఆందోళన చేసిన సభ్యులు సభాపతి ఎంత అర్థించినా శాంతపడకపోవటంతో సభను వాయిదా వేసారు.  

భారతీయ జనతా పార్టీ నాయకురాల సుష్మా స్వరాజ్ అప్పడు అక్కడ లేని రక్షణ మంత్రి సుశీల్ కుమార్ షిండేని ఉద్దేశిస్తూ, మనపని ఇంతేనా, ఉగ్రవాదులు వస్తారు మనల్ని చంపుతారు, తలలు తీసుకుని పోతారు, మనమేమో సంతాపాన్ని తెలియజేస్తాం అంతటితో అయిపోతుంది.  ఎంతకాలమిలా అని అన్నారు.  పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్ సింగ్ ఘాటోవర్, రక్షణ మంత్రి దీని మీద మధ్యాహ్నం తర్వాత సమాధానమిస్తారు అని చెప్పినా ప్రతిపక్షాలు శాంతపడలేదు.

 మార్చిలోనే మత్స్యకారులను అరెస్ట్ చేసిన సంఘటనలు ఆరు జరిగాయని డిఎమ్ కే సభ్యుడు రాజ్యసభలో గుర్తుచెయ్యగా, ఏఐడిఎమ్ కే సభ్యులు ఆందోళన చేస్తూ రాజ్య సభ సభాపతి అన్సారీ దగ్గరికి వెళ్ళారు.  ఆయన వెళ్లి కూర్చోమని హెచ్చరించటంతో అక్కడే బైఠాయించి ఆందోళన సాగించారు.  దానితో రాజ్య సభ ను రేపటికి వాయిదా వేసారు.  ప్రశ్నా సమయాన్ని రద్దు చేసి ఉగ్రవాద చర్యల మీద చర్చించాలంటూ భాజపా ఆందోళన చేసింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  9 mlas suspended by punjab speaker from assembly
Ambassador of italy restrained by supreme court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles